
రోబోటిక్ సర్జరీతో కీళ్ల సంరక్షణ
సాక్షి, చైన్నె: రోబోటిక్ విధానంతో మోకాలి సర్జరీతో కీళ్ల సంరక్షణలో కొత్త శకానికి సీటీఎస్ స్పెషాలిటీ ఆస్పత్రి నాంది పలికింది. చైన్నె అన్నానగర్‌లో ఆదివారం ఆర్టోపెడిక్ కేర్‌లో పేరుగడించిన సీటీఎస్ స్పెషాలిటీ ఆస్పత్రిలో రోబోట్ సాయంతో మొకాలి మార్పిడి విధానాలను ప్రవేశ పెట్టారు. ఈ సేవలను స్థానిక ఎమ్మెల్యే మోహన్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రకాష్ సెల్వం ఈ రోబోటిక్ సేవలను గురించి వివరించారు.సీటీఎస్ స్పెషాలిటీలో అధునాతన ఆర్టోపెడిక్ కేర్‌కు 35 పడకల సౌకర్యం కల్పించినట్టు వివరించారు. క్లినికల్, సర్జిక ల్, కీళ్ల మార్పిడి, సంక్లిష్టమైన ఆర్టోపెడిక్ విధానా లను, ఆర్ర్థోస్కోపి, ట్రామా కేర్, స్పోర్ట్స్ గాయా లు వంటి అంశాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి చికిత్స విధానాలను అందించనున్నామని వివరించారు. రోబోట్ సహాయ సాంకేతికతతో త్వరితగతిన రోగి కోలుకునే దిశగా సర్జరీలకు ప్రత్యేక, అత్యాధునిక వైద్య సేవలను అందించనున్నామన్నారు.