
హిట్ కాంబో రిపీట్ !
తమిళసినిమా: మహారాజా చిత్రం నటుడు విజయ్‌సేతుపతి కెరీర్లోనే చాలా ప్రత్యేకం. కారణం ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించడం అదేవిధంగా 50వ చిత్రం కావడం, అంతకంటే కూడా ఇది విదేశాల్లో కూడా మంచి వసూళ్లు సాధించడం. ఈ చిత్రానికి నితిలన్ స్వామినాథన్ దర్శకుడు. 2024 జూన్ 12వ తేదీన విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. కాగా ఆ తర్వాత దర్శకుడు నితిలన్ మరో చిత్రం చేయకపోవడం విశేషం. నయనతార ప్రధాన పాత్రలో ఒక చిత్రం చేయబోతున్నారని ప్రచారం జరిగింది. అదేవిధంగా అజిత్ హీరోగా చిత్రం చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు. మళ్లీ విజయ్‌సేతుపతి కథానాయకుడిగా చిత్రం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. దీన్ని ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థ నిర్మించనున్నట్లు తెలిసింది. కాగా ప్రస్తుతం విజయ్‌సేతుపతి టాలీవుడ్ సంచలన దర్శకుడు పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఆయన నితిలన్ దర్శకత్వలో నటించడానికి సమ్మతించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

హిట్ కాంబో రిపీట్ !