
ఒకే ట్రాక్‌లో రెండు ఈవీఎంలు
సాక్షి, చైన్నె: చైన్నెలో సాగే ఎలక్ట్రిక్ రైలు సేవలకు అర గంటకు పైగా అంతరాయం బుధవారం ఏర్పడింది. ఇందుకు కారణం ఒకేట్రాక్‌పై రెండు రైళ్లు ఆగటమే. ఈ ఘటన కాసేపు కలకలం రేపినా ఆతర్వాత రైలు సేవలను పునరుద్దరించారు. చైన్నె తాంబరం నుంచి బీచ్ వైపుగా ఉదయం సుమారు 8.40 గంటలకు ఎలక్ట్రిక్ రైలు బయలుదేరింది. ఈ రైలు పల్లావరం స్టేషన్‌కు 5.50 గంటల సమయంలో చేరుకుంది. ఈ రైలు ఒకట వ నెంబరు ప్లాట్ పాం నుంచి బయలు దేరే సమయంలో హఠాత్తుగా ఓ బోగి వద్ద పొగ రావడాన్ని డ్రైవర్‌గుర్తించి ఆపేశాడు. అదే సమయంలో ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్‌లోకి మరో రైలు వెనుకే రావడంతో ఉత్కంఠ నెలకొంది. తక్షణం ఆ రైలును కూత వేటు దూరంలో ఆపేశారు. ఒకే ట్రాక్‌లో రెండు రైళ్లు ఆగడంతోకలకలం రేగింది. హఠాత్తుగా రైళ్లు ఆగడంతో ఉదయాన్నే పనుల నిమిత్తం వెళ్లే వారికి ఇబ్బందులు తప్పలేదు. ముందుగా వెళ్తున్న రైలు బ్రేక్ షడన్‌గా వేయడం వల్లే పొగ వచ్చినట్టు భావించారు. దీంతో ఆ రైలులలో ఉన్నవారందర్నీ దించేశారు. ఆరైలును తాంబరం యార్డ్‌కు పంపించారు. ఈ ప్రక్రియ కారణంగా తాంబరం టూ బీచ్ మధ్య అర గంట పాటుగా సేవలకు ఆటంకం తప్పలేదు.
పల్లావరం వద్ద పొగ
కలకలం