
5 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనకు ఇకపై జరిమానా
సాక్షి, చైన్నె: మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించక పోవడం వంటి ఐదురకాల ఉల్లంఘనలకు ప్రాధాన్యత ఇస్తూ ఇక చైన్నెలో జరీమానాల వడ్డనకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను బుధవారం గ్రేటర్ చైన్నె పోలీసు కమిషనర్ అరుణ్ జారీ చేశారు. వివరాలు.. చైన్నె నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా పోలీసులు ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. పీక్ అవర్స్‌లలో కూడా ప్రధాన మార్గాలలో ట్రాఫిక్ పోలీసులు వాహన దారుల భరతం పట్టేవిధంగా ముందుకెళ్తున్నారు.. తమ వద్ద ఉన్న మొబైల్ పోన్ తరహా ప్రత్యేక పరికరం ఆధారంగా పట్టుబడే వారికి జరిమానా విధిస్తూ , తక్షణం రశీదులను అందజేస్తూ వస్తున్నారు. అలాగే చైన్నె నగరంలోని ప్రధాన మార్గాలలో ఉన్న కెమెరాల ద్వారా నిబంధనలు ఉల్లంఘించే వారి భరతం పడుతున్నారు. ఎవ్వరెవ్వరూ నిబంధనలు ఉల్లంఘిస్తారో వారి మొబైల్ నంబర్లకు ఆటోమెటిక్‌గా జరిమాన సమాచారాలు వెళ్తుంటాయి. జరిమానాలను ట్రాఫిక్ యంత్రాంగం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెంటర్ల వద్దకు వెళ్లి కట్టాల్సిన పరిస్థితి. అయితే, అనేక మంది తమకు జరిమానా కెమెరాల ద్వారా పడ్డా,వాటిని ఖాతరు చేయడం లేదు. జరీమాన కట్టేందుకు ముందుకు రావడం లేదు. అదే సమయంలో పోలీసులు ఇష్టానుసారంగా కెమెరాల ఆధారంగా, తమ వద్ద ఉన్న స్కానర్ల ద్వారా జరిమానాలను విధించి సమాచారాలను ఎస్‌ఎంఎస్ ద్వారా పంపించేస్తున్నారన్న విమర్శలు బయలుదేరాయి. ఇలాంటి విమర్శలకు చెక్ పెట్టే విధంగా ఇక, స్పాట్ ఫైన్ జరీమానల విధించే ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. మద్యం సేవించి వాహనం నడిపే వారు, హెల్మెట్ లేకుండా వాహనంనడిపేవాళ్లు, త్రిబుల్స్ రైడింగ్,అతి వేగం వంటి ఐదు రకాల నిబంధనల ఉల్లంఘనకు ప్రాధాన్యత ఇస్తూ ఇక, జరీమాన వడ్డన మోగనున్నది. సీటు బెల్టూ ధరించక పోవడం, సెల్ పోన్ డ్రైవింగ్‌లకు నిఘా నేత్రాల ద్వారా జరీమాన వడ్డన మోగనుంది. అయితే, సిగ్నల్స్ గిర్ర కాస్తదాటి వచ్చినా, ఇతర నిబంధనలకు జరిమాన నుంచి కాస్త ఉపశమనం కలగనున్నది. అయితే పైనపేర్కొన్న ఐదు నిబంధనలు ఉల్లంఘించే వారే చైన్నె నగరంలో అత్యధికంగా ఉండటం గమనార్హం.