
రుక్మిణి వసంత్‌కు లక్కీఛాన్స్
తమిళసినిమా: లక్కు ఉంటే అవకాశాల కిక్కే వేరు. కొందరు అవకాశాల కోసం ఏళ్ల తరబడి ప్రయత్నిస్తూనే ఉంటారు. మరి కొందరికి ఒక్క హిట్ వస్తే ఆ తరువాత అవకాశాలు వరుస కడుతుంటాయి. ఇక్కడ నటి రుక్మిణి వసంత్ కథే వేరు. ఈ కన్నడ భామ తమిళంలో నటించిన ఒక్క చిత్రం కూడా ఇంకా తెరపైకి రాలేదు. అదేంటో వరుసగా క్రేజీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈమె శివకార్తీకేయన్‌కు జంటగా నటిస్తున్న మదరాశీ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే అంతకంటే ముందు విజయ్ సేతుపతి సరసన నటించిన ఏస్ చిత్రం ఈ నెల 23వ తేదీన తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో క్రేజీ అవకాశం వరించినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదే మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీఛాన్స్. నటుడు కమలహాసన్ కథానాయకుడిగా శింబు, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన థగ్‌లైఫ్ చిత్రాన్ని మణిరత్నం పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జూన్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. దీంతో మణిరత్నం కొత్త చిత్రానికి సిద్ధం అవుతున్నారన్న ప్రచారం చాలా రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ద్విభాషా(తమిళం, తెలుగు) చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో టాలీవుడ్ యువ నటుడు నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించనున్నారని, ఆయనకు జంటగా నటి సాయిపల్లవిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే సాయిపల్లవి విషయం ఏమైందో గానీ ఇప్పుడు ఈ చిత్రంలో నటించే అదృష్టం నటి రుక్మిణి వసంత్‌ను వరించిందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. కాగా కమలహాసన్, శింబు, త్రిషలో భారీ గ్యాంగ్‌స్టర్స్ కథా చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు తదుపరి ఫ్యూర్ లవ్ స్టోరీని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కాగా ఈ అమ్మడు తెలుగులోనూ క్రేజీ అవకాశాలను అందుకుంటున్నారు. ఇప్పటికే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రంలో నటించిన రుక్మిణి వసంత్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌తో జత కట్టే లక్కీఛాన్స్‌ను అందుకున్నట్లు తెలిసింది. ఇలా అతి తక్కువ కాలంలోనే దక్షిణాదిని చుట్టేస్తున్నారన్నమాట.
నటి రుక్మిణి వసంత్