
ఓమ్నీ బస్సు, టూరిస్టు వ్యాన్ ఢీ
● నలుగురి మృతి
సేలం : కరూర్ సమీపంలో ఓమ్ని బస్సు, టూరిస్టు వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో ఒక బాలికసహా నలుగు రు మృతి చెందిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నుంచి నాగర్‌కోయిల్‌కు ఓమ్ని బస్సు బయలుదేరింది. కరూర్ జిల్లాలోని సెమ్‌డై సమీపంలోని జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను ఢీకొని వ్యతిరేక దిశలో సెంట్రల్ మీడియంను దాటింది. ఆ సమయంలో తూత్తుకు డి జిల్లాలోని కోవిల్‌పట్టి ప్రాంతం నుంచి వస్తున్న టూరిస్ట్ వ్యాన్‌ను ఓమ్ని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో టూరిస్ట్ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు పిల్లలు సహా ముగ్గురు మృతి చెందారు. 8 ఏళ్ల బాలిక, టాక్సీ డ్రైవర్, టూరిస్ట్ వ్యాన్ డ్రైవర్, వ్యాన్ లోని ఒక ప్రయాణికుడు మొత్తం నలుగురు మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడగా, సమీపంలో ఉన్న వారు క్షతగాత్రులను రక్షించి కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి, ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఓమ్ని బస్సు అతివేగంగా ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. తీవ్రంగా గాయపడిన వారిలో 14 మంది కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు. మాజీ మంత్రి విజయ్‌కర్ క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి ఎంఆర్ విజయకర్ విలేకరులతో మాట్లాడుతూ కోవిల్‌పట్టి నుంచి ఏర్కాడుకు పర్యాటక వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు పిల్లలు సహా నలుగురు వ్యక్తులు బెంగళూరు నుంచి నాగర్‌కోయిల్‌కు వెళుతున్న లగ్జరీ బస్సును ఢీకొనడంతో ప్రమాదానికి కారణమని చెప్పారు. 14 మంది ప్రభుత్వాస్పత్రిల్లోని ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారని, మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉన్నారని చెప్పారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కొంతమందిని మెరుగైన చికిత్స కోసం మధురై ఆస్పత్రికి తరలించారని తెలిపారు.

ఓమ్నీ బస్సు, టూరిస్టు వ్యాన్ ఢీ