
తలైవన్ తలైవిగా విజయ్ సేతుపతి, నిత్యామీనన్
తమిళసినిమా: నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఒకటి. జాతీయ ఉత్తమ నటి నిత్యామీనన్ కథానాయకిగా నటిస్తున్న ఇందులో యోగి బాబు ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై టీజీ త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, సుకుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇది విజయ్ సేతుపతి నటిస్తున్న 52వ చిత్రం. అదే విధంగా విజయ్ సేతుపతి, పాండిరాజ్ కాంబోలో రూపొందుతున్న తొలి చిత్రం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను తెచ్చుకున్నాయి. తాజాగా చిత్ర టైటిల్‌తో కూడిన టీజర్‌ను విడుదల చేశారు. చిత్రానికి తలైవన్ తలైవి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆ టీజర్‌లో విజయ్ సేతుపతి, నిత్యామీనన్‌ల మధ్య సన్నివేశాలు చిత్రంపై ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉన్నాయి. చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. తలైవన్ తలైవి చిత్రం మంచి కమర్షియల్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందన్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, త్వరలోనే చిత్రాన్ని తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొంది.