పదవీ ఆశలతో లొంగ దీసుకోలేరు! | - | Sakshi
Sakshi News home page

పదవీ ఆశలతో లొంగ దీసుకోలేరు!

Apr 28 2025 1:03 AM | Updated on Apr 28 2025 1:03 AM

పదవీ ఆశలతో లొంగ దీసుకోలేరు!

పదవీ ఆశలతో లొంగ దీసుకోలేరు!

సాక్షి, చైన్నె : అధికారంలో వాటా, డిప్యూటీ సీఎం పదవీ అన్న ఆశలను చూపించి తనను లొంగ దీసుకోలేరని వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్‌ వ్యాఖ్యానించారు. తన కోసం తెరిచి ఉంచిన అన్నాడీఎంకే, విజయ్‌ తమిళగ వెట్రి కళగంల కూటమి తలుపులను తానే మూసి వేసినట్టు స్పష్టం చేశారు. వివరాలు.. పుదుచ్చేరి సమీపంలోని తిరుభువనంలో ప్రతిష్టించిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ వేడుక ఆదివారం జరిగింది. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించినానంతరం వీసీకే నేత తిరుమావళవన్‌ కూటమి విషయంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ తిరుమావళవన్‌కు పదవీ ఆశ చూపించి కొనలేరని వ్యాఖ్యానించారు. కూటమిలోకి వస్తే, డిప్యూటీ సీఎం పదవి, మంత్రి వర్గంలో వాటా అంటూ ఆశలు చూపించారని, అయితే వీటన్నింటికీ లొంగేవాడ్ని తాను కాదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే, విజయ్‌ తమిళగ వెట్రి కళగం తన కోసం తెరిచి ఉంచిన డోర్లను తానే మూసి వేసినట్టు వ్యాఖ్యానించారు. తాను ఓ కూటమిలో ఉన్నానని, అయినా, వారి తప్పులను ధైర్యంగా ఎత్తి చూపిస్తున్నానని, పోలీసుల తీరును ఖండిస్తున్నానని డీఎంకే కూటమి గురించి వివరించారు. తాను డీఎంకేలో కొనసాగడాన్ని ఎగతాళిగా చూస్తున్నారని పేర్కొంటూ కూటమిలో ఉన్నా, దైర్యంగా తప్పులను ఎత్తి చూపించడం, విమర్శించడంలో తాము వెనుకాడడం లేదన్నారు. బీజేపీ, పీఎంకే ఏ కూటమిలో ఉంటుందో అక్కడ వీసీకే ఉండదని స్పష్టం చేశారు. విజయ్‌ తన గురించి ఆయన మనస్సులో ఉన్న మాటను చెప్పారని ప్రస్తావిస్తూ, అయినా తాను కూటమి తలుపు మూసి వేసినట్టు పేర్కొన్నారు. కాగా, తిరుమా చేసిన ఈ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే సీనియర్‌ నేత జయ కుమార్‌ స్పందిస్తూ, ఆయన డీఎంకే కూటమిలో ఉన్నా, తీవ్ర మనస్తాపంతో ఉన్నట్టు స్పష్టమవుతోందన్నారు. అందుకే కూటమి లెక్కలతో మనస్సులో ఉన్నది వాగేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ మాట్లాడుతూ, ఇతర కుటమి తలుపులు మూయడం కాదని, ముందు ఆయన ఉన్న కూటమి తలుపు మూసుకోమనండి అని చమత్కరించారు. ముందుగా తాను ఉన్న ఇంటి డోర్లు మూసుకుంటే ఆయనకే మంచిదని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే కూటమి తలుపులు ఎలా తిరుమా మూయగలరని ప్రశ్నించారు.

తిరుమా వ్యాఖ

అన్నాడీఎంకే, విజయ్‌ కూటమి

డోర్ల మూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement