వెట్రిమారన్‌ దర్శకత్వంలో శింబు? | - | Sakshi
Sakshi News home page

వెట్రిమారన్‌ దర్శకత్వంలో శింబు?

Jun 6 2025 6:25 AM | Updated on Jun 6 2025 6:25 AM

వెట్ర

వెట్రిమారన్‌ దర్శకత్వంలో శింబు?

తమిళసినిమా: ఏ రంగంలోనైనా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు అయినా ఊహించనవి జరగడమే జీవితం అంటారు. అందుకు సినిమా రంగం అతీతం కాదు. ఈ రంగంలో శుక్రవారం ఒకరికి జాతకం మారుతుంది అంటారు. ప్రస్తుతం శింబు పరిస్థితి ఇలాగే ఉంది అని చెప్పవచ్చు. గత రెండేళ్లకు పైగా చిత్రం చేయని ఈయన తాజాగా కమలహాసన్‌తో కలిసి మణిరత్నం దర్శకత్వంలో థగ్‌లైఫ్‌ చిత్రంలో నటించారు. ఈచిత్రం గురువారం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం వరుసగా చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దేశింగు పెరియస్వామి దర్శకత్వంలో ఒక చిత్రం, పార్కింగ్‌ చిత్రం రాంకుమార్‌ దర్శకత్వంలో మరో చిత్రం, అశ్వద్‌ మారి ముత్తు దర్శకత్వంలో ఇంకో చిత్రం, అంతేకాకుండా ఒక ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత నిర్మించే చిత్రంలోనూ నటించడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మరో చిత్రాన్ని శింబు కమిట్‌ అయినట్లు తెలిసింది. జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత వెట్రిమారన్‌ దర్శకత్వంలో శింబు నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీన్ని వి.క్రియేషన్‌న్స్‌ సంస్థ నిర్మించినట్లు, క్రేజీ చిత్ర షూటింగ్‌ జూలైలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదన్నది గమనార్హం. మరో విషయం ఏమిటంటే ఇదే చిత్ర నిర్మాణ సంస్థలో దర్శకుడు వెట్రిమారన్‌, సూర్య కథానాయకుడిగా వాడివాసల్‌ చిత్రం చేయడానికి చాలా కాలం సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. ఈచిత్రంతోపాటు శింబు కథానాయకుడిగా నటించే చిత్రాన్ని ప్రారంభిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

వెట్రిమారన్‌ దర్శకత్వంలో శింబు? 1
1/1

వెట్రిమారన్‌ దర్శకత్వంలో శింబు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement