తమిళసినిమా: ఇండియన్ సినిమాలో పరిచయం లేని దర్శకుడు శంకర్. బ్రహ్మాండ చిత్రాలకు కేరాఫ్‌గా పేరుగాంచిన ఇటీవల దర్శకత్వం వహించిన ఇండియన్ –2, టాలీవుడ్ చిత్రం గేమ్ చేంజర్ నిరాశ పరిచినా తాజాగా మరో బ్రహ్మాండ చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇది చారిత్రక కథాచిత్రంగా ఉండబోతోంది. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పక్కన పెడితే దర్శకుడు శంకర్ వారసురాలు అదితి శంకర్ కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి డీజే పాటలు పయనిస్తున్న విషయం తెలిసిందే. ఈమె కార్తీకదీపం పరిచయం అయ్యి తొలి చిత్రంతోనే కథానాయకిగా, గాయనీగా విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మావీరన్ చిత్రంలో శివకార్తికేయన్ తో జత కట్టి మరో సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల నటించిన నేశిప్పాయా చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయినా తాజాగా టాలీవుడ్‌లోనూ ఈ భామ ఎంట్రీ ఇచ్చారు. లేకపోతే ఈమె సోదరుడు దర్శకుడు శంకర్ వారసుడు అర్జిత్ శంకర్ కూడా హీరోగా పరిచయం కావడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఈయన ప్రస్తుతం దర్శకుడు ఏఆర్.మురుగదాస్ వద్ద సహాయ దర్శకుడుగా పనిచేస్తున్నారు. కాగా త్వరలో డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా దర్శకత్వం వహించనున్న చిత్రం ద్వారా అర్జిత్ శంకర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో టాక్ వైరల్ అవుతోంది. కాగా ఈచిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.