
ఇక సమరమే!
● నేటి నుంచి పూర్తిస్థాయిలోసభా కార్యకలాపాలు ● అధికార పక్షాన్ని ఢీకొనేందుకు సిద్ధమైన ప్రతిపక్షాలు ● అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్న విపక్ష నాయకులు ● స్పీకర్‌పై అవిశ్వాసం నోటీసు ● ఓటింగ్‌కు అవకాశం
స్పీకర్‌పై అవిశ్వాసం నోటీసు
స్పీకర్ అప్పావును అన్నాడీఎంకే టార్గెట్ చేసింది. సభా వ్యవహారాలలో తమకు అన్యాయం చేస్తున్నారన్న ఆగ్రహంతో కన్నెర్ర చేసింది. తమ ప్రసంగాలు ప్రత్యక్ష ప్రసారాలు కావడం లేదని, తమకు సమయం కేటాయించడం లేదన్న అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్‌కు అన్నాడీఎంకే స్పీకర్‌పై అవిశ్వాస నోటీసు జారీ చేసింది. దీనిపై సోమవారం ఓటింగ్‌కు అవకాశాలు ఉన్నాయి. ఈ దృష్ట్యా, స్పీకర్ అప్పావుకు బదులుగా డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి సభను నడిపించే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఈ విషయంగా స్పీకర్ అప్పావును ప్రశ్నించగా, వారి అవిశ్వాస తీర్మానంను పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొన్నా రు. గత సమావేశాలలో కొన్ని సాంకేతిక కారణాలతో సమస్యలు ఎదురయ్యాయని, అవి ఇక పు నరావృతం కాకుండా చూసుకుంటామన్నా రు. కాగా, అవిశ్వాసంపై ఓటింగ్ జరిగిన పక్షంలో డీఎంకే మెజారిటీ ఆధారంగా అది వీగి పోయే అవకాశాలు అధికంగా ఉండడం గమనార్హం.
సాక్షి, చైన్నె: అసెంబ్లీలో బడ్జెట్‌ల దాఖల పర్వం ముగిసింది. ఇక, నిధుల కేటాయింపునకు సంబంధించిన అంశాలు, వివిధ తీర్మానాలపై జరగనుంది. దీనిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు అన్నాడీఎంకే , బీజేపీ, పీఎంకే వంటి ప్రతిపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. అస్త్రాలతో అధికార పక్షాన్ని ఢీ కొట్టేందుకు రెడీ అయ్యాయి. దీంతో సోమవారం నుంచి సభా పర్వం వేడెక్కే అవకాశాలు ఉన్నాయి. స్పీకర్ అప్పావుపై అవిశ్వాస తీర్మానం నోటీసును అన్నాడీఎంకే జారీచేసిన దృష్ట్యా, ఓటింగ్ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వివరాలు.. 2025–26 సంవత్సరానికి గాను ఆర్థిక బడ్జెట్, రైతు సంక్షేమాన్ని కాంక్షించే వ్యవసాయ బడ్జెట్ అసెంబ్లీ ముందుకు చేరింది. ఆ శాఖల మంత్రులు తంగం తెన్నరసు, ఎంఆర్‌కే పన్నీరు సెల్వం తమ పద్దులను సభ ముందు ఉంచారు. ఈ రెండు రోజుల ప్రక్రియ ముగియడంతో సోమవారం నుంచి బడ్జెట్ మీద చర్చ జరగనుంది. సంతాప తీర్మానాల తర్వాత ఈ చర్చ మొదలు కానుంది. 18, 19, 20 తేదీలలోనూఈ రెండు బడ్జెట్‌లపై చర్చ కొనసాగనుంది. 21వ తేదీన సభలో ఆదాయ వ్యయాలు, ఇతర అంశాలకు సంబంధించిన ఖర్చులతో అనుబంధ పద్దును ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు సభ ముందు గణాంకాలతో సహా ఉంచనున్నారు. 22, 23 శని, ఆదివారాలు సెలవు కావడంతో ఈనెల 24వ తేదీ నుంచి సభలో శాఖల వారీగా నిధుల కేటాయింపులు, ప్రగతి ప్రాజెక్టులు, వివిధ అంశాలపై చర్చలు హోరెత్తనున్నాయి.
నీటి పారుదల శాఖ నుంచి మొదలు..
ఈనెల 24వ తేదీన నీటి పారుదల శాఖ, 25న నగరాభివృద్ధి శాఖ, 26న గ్రామీణాభివృద్ధి, 27న ప్రత్యేక పథకాలు, క్రీడలు, యువజన సంక్షేమ శాఖ, 28న ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు, అటవీ, పర్యావరణ శాఖలకు నిధులు కేటాయింపుల చర్చ,సమీక్షలు జరగనున్నాయి. ఈనెల 29, 30 శని ఆదివారాలు, 31న రంజాన్ సెలవు తర్వాత సభ ఏప్రిల్ 1వ తేది పునర్ ప్రారంభం కానుంది. ఆ రోజున రహదారులు, చిన్న హార్బర్లు, ప్రజా పనుల శాఖ, 2న వ్యవసాయం, మత్స్య, పశు సంవర్ధక శాఖలు, 3వ తేదీ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ, 4న న్యాయం, జైళ్లు శాఖ చర్చ జరగనున్నది. 5, 6 సెలవు దినాలు కావడంతో 7వ తేదిన గృహ నిర్మాణం, 8న సహకారం, ఆహార భద్రత శాఖ,9న ఎంఎస్‌ఎంఈల శాఖ చర్చ, 10వ తేదీ మహావీర్ జయంతి తర్వాత 11, 12, 13, 14 తేదీల సెలవుతో 15వ తేదీ సభ పునర్ ప్రారంభం కానుంది. ఆ రోజున సమాచారం, తమిళాభివృద్ధి శాఖ, 16వ తేదీ దివ్యాంగుల సంక్షేమం, మహిళా సంక్షేమం, హక్కుల శాఖ, 17వ తేదిన పర్యాటకం, హిందూ దేవాదాయ ఽశాఖ, చర్చ తర్వాత 18న గుడ్ ఫ్రైడే, 19,20 శని, ఆదివారాల సెలవుతో 21వ తేదిన విద్యుత్, ఎకై ్సజ్, 22న వైద్యం,ఆరోగ్య శాఖ, 23న వాణిజ్య పనులు, 24న విద్యా శాఖ, 25న ఐటీ ,26న వెనుకబడిన సంక్షేమం,మైనారిటీశాఖ చర్చ లు హోరెత్తనున్నాయి. 27న సెలవు దినం కావడంతో 28వ తేదీన అసెంబ్లీ వ్యవహారాలతోపాటూ ఆయా శాఖల మంత్రుల సమాధానాలు ఇవ్వనున్నారు. 29, 30 తేదీలలో సీఎం స్టాలిన్ పరిధిలోని హోంశాఖపై చర్చ, సీఎం ప్రత్యేక ప్రసంగాలు జరగనున్నాయి. ఈ ప్రక్రియలన్నీ ఓ వైపు ఉంటే,మరో వైపు అధికార పక్షాన్ని ఢీ కొట్టేందుకు ప్రతి పక్షాలు అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి.
సై అంటే సై..
టాస్మాక్ స్కాం, కేరళకు ఖనిజ సంపదల అక్రమ రవాణా,రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న నేరాలు, విచ్చల విడిగాసాగుతున్న గంజాయి వంటి మాధక ద్రవ్యాల విక్రయాలు, బాలికలు, మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అఘాయిత్యాలు వంటిఅంశాలను ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకున్నాయి. డీఎంకే పాలన అవినీతిమయం అని చాటే దిశగా అధికార పక్షాన్ని డీకొట్టే విధంగా సభా వేదికగా సమరానికి అన్నాడీఎంకే కాలుదువ్వేపనిలో పడింది. బీజేపీ, పీఎంకేలు సైతం తమ దైన బాణిలో అస్త్రాలు సిద్ధంచేసుకున్నాయి. త్రిభాషా విధానం, లోక్‌సభ పునర్విభజన పేరిట డీఎంకే ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టేందుకు బీజేపీ రెడీ అయ్యింది. ఇక తమకు రిజర్వేషన్ అమలు, కులగణనకు పట్టుబట్టే విధంగా పీఎంకే పోరుకు సిద్ధమైంది. ఈ దృష్ట్యా, అసెంబ్లీలో సభా పర్వం వేడెక్కనుంది. తామేమీ తక్కువ కాదన్నట్టుగా డీఎంకే సైతం ప్రతిపక్షాల దాడిని తిప్పికొట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సీఎం స్టాలిన్ నేతృత్వంలో ఆ పార్టీ శాసన సభా పక్షం సమావేశం జరిగింది.ఇందులో సభలో వ్యవహరించాల్సిన అంశాల గురించి చర్చించి వ్యూహాలను రచించి ఉన్నారు.

ఇక సమరమే!