తిరుత్తణి: రాష్ట్రంలో ఐదు రోజుల పాటూ జాతీయ స్థాయి గన్, రైఫిల్ షూటింగ్ పోటీల్లో పాల్గొనేందుకు విచ్చేసిన అసోంం, బిహార్ రాష్ట్రాలకు చెందిన పోలీసులు, కమెండో బృందానికి తిరుత్తణిలో శనివారం రైల్వే పోలీసులు స్వాగతం పలికారు. తమిళనాడు పోలీసు శాఖ కమెండో ఫోర్స్ ద్వారా చెంగల్పట్టు జిల్లాలో 17 నుంచి 21 వరకు ఐదు రోజుల పాటూ గన్, రైఫిల్ షూటింగ్ పోటీలు నిర్వహించనున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసులు, అదనపు సహాయ బలగాలు, కమెండో ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు షూటింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం అస్సాం నుంచి 21 మంది కమెండో ఫోర్సు, బిహార్ నుంచి 29 మంది పోలీసులు రెండు బ్యాచ్‌లుగా రైలు ద్వారా తిరుత్తణికి చేరుకున్నారు. వారికి రైల్వే పోలీసులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. తిరుత్తణి నుంచి పోలీసుల వాహనాల ద్వారా చెంగల్పట్టు జిల్లాకు బయల్దేరి వెళ్లారు. అత్యాధునిక ఆయుధాలతో పోలీసులు ఈ పోటీల్లో పాల్గొనున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.