● గంజాయి, కత్తులు, బైకు స్వాధీనం
తిరువొత్తియూరు: చైన్నె కొడుంగయూరులో వాహనాల తనిఖీలో పోలీసులు ఇద్దరు రౌడీలను అరెస్టు చేసి వారి వద్ద ఉన్న గంజా, కత్తులను, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. చైన్నె కొడుంగయూర్ ముత్తమ్మ నగర్ రెండవ బ్లాక్ ప్రాంతంలో కొడుంగయూరు పోలీస్ ఇన్‌స్పెక్టర్ శరవణన్ నేతృత్వంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో సందేహాస్పదంగా బైకుపై వస్తున్న ఇద్దరిని పోలీసులు అడ్డుకొని ప్రశ్నించారు. వారు పొంతన లేని సమాధానం చెప్పడంతో బైక్‌తో సహా ఇద్దరిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేపట్టా. వారు కొడుంగయూరు ముత్తమిల్ నగర్ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ (39), మనలి చిన్న షేకాడు ప్రాంతానికి చెందిన అశోక్ కుమార్ (40) అని తెలిసింది. ప్రముఖ రౌడీలు అయినా వారి బైకు నుంచి కత్తి, గంజాయి ప్యాకెట్లను, బైకును స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు తెలిసింది. దీంతో ఇద్దరిని పోలీసులు కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.