అన్నానగర్: ఉప్పిలియాపురం సమీపంలో గురువారం తెల్లవారుజామున బైక్ ప్రమాదంలో పారామిలటరీ సైనికుడు మృతి చెందాడు. వివరాలు.. తిరుచ్చి జిల్లా ఉప్పిలియాపురం పక్కనే ఉన్న సోపానాపురం పంచాయతీ కంచెరిమలై పుత్తూరుకు చెందిన రవి (52) పారామిలటరీ జవాన్‌గా పని చేసన్నారు. ఇటీవల సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున కంచెరిమలై పుత్తూరు నుంచి ఉప్పిలియాపురం వైపు బైక్‌లో వస్తుండగా స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఉప్పిలియాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ముగ్గురు పోలీసులపై
సస్పెన్షన్ వేటు
కొరుక్కుపేట: నేరాలకు పాల్పడిన ముగ్గురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. శివగంగైలోని బస్టాండ్ సమీపంలో టాస్మాక్ దుకాణం ఉంది. దీనికి సమీపంలోనే మూతపడిన మరో దుకాణం అనుమతితో బార్‌గా నడుస్తోంది. శివగంగ ఆర్‌మ్డ్ ఫోర్స్ పోలీసులు షణ్ముఖవేల్, దాస్ మోహన్ పోలీసు యూనిఫాం ధరించి బార్‌లోకి వెళ్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంపై ఎస్పీ అరవింద్ విచారణ జరిపారు. ఇందులో టాస్మాక్‌కు వెళ్లేది నిజమేనని తేలటంతో ఇద్దరినీ బుధవారం సస్పెండ్ చేశారు. అదేవిధంగా దేవకోట్ నగర్ పోలీస్ స్టేషన్‌లో సిలంబరసన్ పోలీసుగా పనిచేస్తున్నాడు. ఆయన డబ్బుతో జూదం ఆడినట్లు ఫిర్యాదు వచ్చింది. విచారణ జరిపిన ఎస్పీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.