
కేజీ.కండ్రిగ ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రం
తిరుత్తణి: రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో వరి కొనుగోలు చేసి బకాయిలు సకాలంలో జమచేస్తున్నందున రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుత్తణి సమీపంలోని కేజీ.కండ్రిగలోని ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రంలో చుట్టు పక్కల గ్రామాలకు చెందిన రైతులు తమ పేర్లు నమోదు చేసుకుని వరి సరఫరా చేస్తున్నారు. ప్రైవేటు మార్కెట్ ధర కంటే అధికంగా టన్నుకు ప్రభుత్వం రూ.2,310 మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేస్తున్నందున రైతులు ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాలకు సరఫరాకు ఆసక్తి చూపుతున్నారు. వర్షాకాలం కావడంతో వరి తడిచి నిరుపయోగం కాకుండా రైతులను ఆదుకునేందుకు వీలుగా వెంటనే కొనుగోలు చేస్తుండడంతో రైతులు పంట దిగుబడి చేసి వెంటనే సరఫరా చేస్తున్నట్లు రైతుల ఖాతాల్లో వారంలో బకాయిలు చెల్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు.