
బోసిపోయిన తహసీల్దార్ కార్యాలయం
తిరుత్తణి: డిమాండ్ల పరిష్కారం కోసం రెవిన్యూ సిబ్బంది మంగళవారం విధులు బహిష్కరించడంతో కార్యాలయాలు బోసిపోయాయి. తహసీల్దార్, ఆర్డీఓ, ఆర్‌ఐ, వీఆర్వో కార్యాలయాలకు వచ్చిన ప్రజలు గంటల తరబడి వేచివుండి వెనుతిరిగారు. కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, పదోన్నతులు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం డీఏ పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు.