
రష్మిక మందన్న అంటే అభిమానుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ వివాదాల్లో చిక్కుకోవడం అన్నది అటుంచితే, తన అందాలతో కుర్రకారు గుండెల్ని మాత్రం బాగానే కొల్లగొడుతోందని చెప్పక తప్పదు. ఇటీవల ఈమె విజయ్‌తో రొమాన్స్ చేసిన వారీసు చిత్రం సక్సెస్ అయినా, ఈమె మాత్రం ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్రను ఒప్పుకుందనే విమర్శలను ఎదుర్కొంది. అయితే తాను నటుడు విజయ్ అభిమానిని అని.. అందుకే ఆ చిత్రంలో తన పాత్రకు ప్రాముఖ్యత లేదని తెలిసినా నటించడానికి అంగీకరించినట్లు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు.
కాగా నటి రష్మిక మందన్న క్రేజ్ పుష్ప చిత్రానికి ముందు ఆ తర్వాత అన్నట్లుగా మారింది. కారణం పుష్ప చిత్రం తమిళం, హిందీ భాషల్లోనూ విజయం సాధించడమే. ముఖ్యంగా ఆ చిత్రంలోని సామి సామి పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అందులో రష్మిక మందన్న డాన్స్ చాలా పాపులర్ అయ్యింది. ఏ కార్యక్రమం జరిగిన ఆ పాట ఉండాల్సిందే. అదే విధంగా రష్మిక మందన్న ఏ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను సామి సామి పాటకు డాన్స్ చేయాలి అనే కోరుతుంటారు. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్న తెలుగులో తనకు అనూహ్య క్రేజ్‌ను సంపాదించి పెట్టిన పుష్ప చిత్రం సీక్వెల్‌లో నటిస్తున్నారు. అదేవిధంగా మరోసారి విజయ్ దేవరకొండతో రొమాన్‌న్స్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇకపోతే రష్మిక ఆనందన్న తరచూ తన అభిమానులతో సామాజిక మాధ్యమాల ద్వారా టచ్‌లో ఉంటున్నారు. వారితో తన చిత్రాల వివరాలను పంచుకుంటూ, వారి ప్రశ్నలకు బదులిస్తూ సంతోష పరుస్తున్నారు. అలా ఇటీవల అభిమానంతో ముచ్చటించారు. అప్పుడు ఒక అభిమాని నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీతో కలిసి సామి సామి పాటకు డా్‌న్స్ చేస్తానని చెప్పాడు. దీంతో వెంటనే స్పందించిన రష్మిక మందన్న ఆ పాటకు ఇప్పటికే చాలాసార్లు డాన్స్ చేశానని ఇంక చాలని బదులిచ్చారు. నిజంగా మనం కలిస్తే మరేదైనా చేద్దాం అంటూ ఆమె బదులిచ్చింది.