
● 16 కేజీల గంజాయి
స్వాధీనం
తిరువళ్లూరు: అంబత్తూరులో గంజాయిని నిల్వ వుంచి తిరుములైవాయల్ రైల్వేస్టేషన్ సమీపంలో విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా తిరుములైవాయల్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఇద్దరు యువకులు సంచరిస్తున్నట్టు అంబత్తూరు ఇన్‌స్పెక్టర్ ధనమ్మాల్‌కు ప్రయాణికులు సమాచారం అందించారు. దీంతో ప్రత్యేక టీమ్ అక్కడికి చేరుకుని ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారు చైన్నె వీరాపురం గ్రామానికి చెందిన సెల్వం కుమారుడు సూర్యకుమార్(21), కొడుంగయూర్ ప్రాంతానికి చెందిన శివ కుమారుడు మణిగండన్ ఆలియాస్ కుళ్లుమణి(25)గా గుర్తించారు. వారు గంజాయి విక్రయిస్తున్నట్టు తేలింది. వారిని అరెస్టు చేసి 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారు కేరళ నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. సూర్యకుమార్ 2018లో ఫోక్సో యాక్ట్ కింద అరెస్టయి బెయిల్‌పై వున్నాడు.
అరెస్టయిన సూర్యకుమార్, స్వాధీనం చేసుకున్న గంజాయి,
అరెస్టయిన మణిగండన్ అలియాస్ కుళ్లుమణి

