క్లుప్తంగా

కీచ్చళం చెరువు కాలువకట్టపై రోడ్డు ఏర్పాటు చేస్తున్న దృశ్యం   - Sakshi

చెరువు కాలువకట్టపై

రోడ్డు వద్దు

పళ్లిపట్టు: చెరువు కాలువకట్టపై రోడ్డు ఏర్పాటు వద్దని రైతులు డిమాండ్‌ చేశారు. పళ్లిపట్టు యూనియన్‌ కీచ్చళం పంచాయతీలోని పంటపొలాల వద్ద రెండు దశాబ్దాలుగా మూడు కుటుంబాల వారు నివాసముంటున్నారు. ఇళ్ల నుంచి రోడ్డుకు వచ్చి వెళ్లేందుకు దారిలేక ఇబ్బందులు పడుతున్నారు. తాము రాకపోకలు సాగించేందుకు దారి చూపాలని అధికారులను కోరారు. దీంతో రెవెన్యూ అధికారులు చెరువుకట్ట పోరంబోకు స్థలాన్ని సర్వే చేసి రాకపోకలుకు వీలుగా జేసీబీతో పనులు చేపట్టారు. నొచ్చిలి చెరువు నుంచి వర్షపు ఎక్కువగా కాలువ ద్వారా కీచ్చళం చెరువుకు వస్తుందని, కాలువకట్ట కూల్చి దారి ఏర్పాటు చేస్తే వర్షపు నీరు సమీపంలోని పంట పొలాలను ముచ్చెత్తి నష్టం వాటిల్లుతుందని రైతులు నిరసన తెలిపారు. కట్ట కూల్చివేతను ఆపేసి వేరే చోట రోడ్డు ఏర్పాటుచేయాలని కలెక్టర్‌ను కోరారు.

టైరు పేలి సిమెంట్‌ లారీ బోల్తా

అన్నానగర్‌: మధురవాయల్‌ బైపాస్‌ రోడ్డులో బుధవారం ఉదయం 6 గంటలకు తాంబరం వైపు సిమెంట్‌ మిక్స్‌ర్‌ లోడుతో లారీ బయలుదేరింది. దీన్ని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన డ్రైవర్‌ రాజేష్‌ నిశాంత్‌ నడిపాడు. వానగరం సమీపంలోకి రాగానే ఒక్కసారిగా పెద్దశబ్దంతో లారీ ముందు టైరు పేలింది. ఈ క్రమంలో లా రీ అదుపు తప్పి బోల్తా పడింది. అలాగే లారీలో ని సిమెంట్‌ మిశ్రమం అంతా రోడ్డుపై పడిపోయింది. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ పోలీసులు లారీని తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ రాజేష్‌ను రక్షించి చికిత్స నిమిత్తం కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కోయంబేడు ట్రాఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌ విభా గం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చర్చి మతబోధకుడి అరెస్టు

తిరువొత్తియూరు : తెన్‌కాశి జిల్లాలో చర్చికి వచ్చిన మహిళను లైంగికంగా వేధించిన మతబోధకుడిని పోలీసులు అరెస్టు చేశారు. తెన్‌కాశి జిల్లా ఆలంగుళం ప్రాంతంలో ఉన్న చర్చిలో మతబోధకుడిగా స్టాన్లీ కుమార్‌ (49) పనిచేస్తున్నాడు. ఆలంగుళం ప్రాంతానికి చెందిన ఒక మహిళ ఆలంగుళం డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. మతబోధకుడు స్టాన్లీ కుమార్‌ చర్చికి వస్తున్న మహిళ సెల్‌ఫోన్‌ నెంబర్లు తీసుకుని లైంగిక వేధింపులకు దిగుతున్నాడని వాపోయింది. మరో గ్రామానికి చెందిన ఒక యువతి స్నానం చేస్తుండగా ఫొటోలు తీసి వాటిని చూపించి లైంగికంగా వేధిస్తున్నట్టు పేర్కొంది. స్టాలిన్‌ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి స్టాన్లీ కుమార్‌ను అరెస్టు చేశారు. అతని సెల్‌ఫోన్‌లో ఉన్న వీడియోలు, పొటోలను డిలీట్‌ చేశారు.

బాలికను గర్భవతిని చేసిన విద్యార్థి అరెస్టు

తిరువొత్తియూరు: కాంచీపురం సమీపంలో 9వ తరగతి విద్యార్థిని గర్భవతిని చేసిన కళాశాల విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. కాంచీపురం సమీపంలోని పుల్లూరుకు చెందిన బాలిక 9వ తరగతి చదువుతోంది. కొన్ని రోజులుగా విద్యార్థిని శరీరంలో మార్పులు వచ్చాయి. స్పృహ తప్పి పడిపోవడంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆమె మూడు నెలల గర్భిణిగా తేల్చారు. తల్లిదండ్రులు కాంచీపురం మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణలో గోవిందవాడి సమీపంలోని అగరం గ్రామానికి చెందిన లోకనాథన్‌ అనే యువకుడు బాలికను ప్రేమిస్తున్నట్టు తెలిసింది. అతను తరచూ పుల్లూరుకు వచ్చి వెళుతూ బాలికతో శారీరకంగా కలిసినట్టు తేలింది. పోలీసులు కేసు నమో దు చేసుకుని లోకనాథన్‌ను అరెస్టు చేశారు.

రైలు కింద పడి

టీచర్‌ ఆత్మహత్య

వేలూరు: తిరుపత్తూరు పెరియార్‌ నగర్‌కు చెందిన సదాశివం సెల్‌ఫోన్‌ దుకాణం నడుపుతున్నాడు. ఇతని భార్య అనిత(38) టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. అనిత తిరుపత్తూరు పునిచిమోటూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. సదాశివానికి మద్యం తాగే అలవాటు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో తరచూ దంపతుల మధ్య ఘర్షణలు చోటు చేసుకునేవి. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య మరోసారి గొడవ చోటు చేసుకుంది. దీంతో మనో వేదనకు గురైన అనిత బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని రైల్వే పట్టాల వద్దకు వెళ్లి.. రైలుకింద పడిపోయి ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే ఇంజిన్‌ డ్రైవర్‌ జోలార్‌పేట రైల్వే పోలీసులకు సమాచారం అందజేశారు. ఆర్పీఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top