
ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వెబ్ సీరీస్ హవా నడుస్తోందనే చెప్పాలి. ఈ వెబ్ సీరీస్ ప్రేక్షకుల ఇంట్లోనే కట్టి పడేస్తున్నాయనే చెప్పాలి. అలాంటి తాజా వెబ్‌సీరీస్ మాయతోట్ట. ఇది హంగామా ఓటీటీ సంస్థ ఒరిజినల్ వెబ్ సీరీస్. పొలిటికల్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో సాగే వైవిధ్యభరిత సిరీస్. నందకుమార్‌రాజు దర్శకత్వం వహించిన ఈ వెబ్ సీరీస్‌లో నటి చైత్రారెడ్డి, నటుడు అమిత్ భార్గవ్, కుమరన్ తంగరాజన్ ప్రధాన పాత్రలు పోషించారు. హంగామా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సీరీస్ గురించి ఆ సంస్థ సీఈఓ సిద్ధార్థ రాయ్ మీడియాతో మాట్లాడుతూ మంచి క్రియేటివ్ ప్రాజెక్ట్‌లను అందించాలన్నదే తమ ప్రయత్నం అన్నారు. ఈ మాయతోట్ట వెబ్ సీరీస్ ద్వారా తొలిసారిగా కోలీవుడ్‌లోకి ప్రవేశించామన్నారు.
ఈ వెబ్ సీరీస్ ప్రేక్షకుల ఆదరణ పొందడం సంతోషంగా ఉందన్నారు. ఇకపై కూడా వైవిధ్యభరిత సీరీస్‌లను అందించడానికి కృషిచేస్తామని చెప్పారు. చైత్రారెడ్డి మాట్లాడుతూ హంగామా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న తొలి వెబ్‌సీరీస్ మాయతోట్టలో నటించడం చాలా థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. ఇందులో తాను పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా నటించినట్లు చెప్పారు. ఇది పర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్ కథా వెబ్ సీరీస్ అని చెప్పారు. దీనికిప్పుడు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రావడం సంతోషంగా ఉందని అన్నారు. అమిత్ భార్గవ్ మాట్లాడుతూ ఇది ఇంట్లోని ప్రతి కుటుంబ సభ్యుడిని హత్తుకునే కథా సీరీస్‌గా ఉంటుందన్నారు. ప్రతి సన్నివేశం ఊహించని విధంగా ఉత్కంఠను రేకెత్తించే విధంగా యూనిక్ కథాంశంతో సాగే ఒరిజినల్ వెబ్ సీరీస్ ఇదన్నారు. ఇందులో నటి చైత్రారెడ్డి, కుమరన్‌తో కలిసి నటించడం సంతోషకరం అన్నారు.