
ఉదయం నుంచే బారులు
నడిగూడెం : ఈ నెల 8న నడిగూడెం పీఏసీఎస్‌కు 444 బస్తాల యూరియా వచ్చింది. విషయం తెలిసిన రైతులు మంగళవారం తెల్లవారుజాము నుంచే రైతు వేదిక వద్ద చిట్టీల కోసం బారులుదీరారు. రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఒకటి చొప్పున, ఐదు ఎకరాల రైతులకు రెండు చొప్పున బస్తాలు పంపిణీ చేశారు. మిగిలిన రైతులు నిరాశతో వెనుదిరిగారు. కాగా నారాయణపురం గ్రామానికి చెందిన మహిళా రైతు ఉలవల పద్మ ఉదయం ఏడు గంటలకే రైతు వేదిక వద్దకు వచ్చారు. మధ్యాహ్న భోజనం రైతు వేదిక వద్ద బయట తింటుండడంతో అందరూ ఆమెను ఆశ్చర్యంగా చూశారు.