అవే బారులు.. అదే గోస | - | Sakshi
Sakshi News home page

అవే బారులు.. అదే గోస

Sep 9 2025 6:46 AM | Updated on Sep 9 2025 6:46 AM

అవే బ

అవే బారులు.. అదే గోస

తిరుమలగిరి (తుంగతుర్తి): యూరియా కష్టాలు రైతులను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. యూరియా కోసం తెల్లవారు జామునుంచే పీఏసీ ఎస్‌ కేంద్రాలు, మనగ్రోమోర్‌ కేంద్రాల వద్ద రైతులు బారులుదీరుతున్నారు. సోమవారం ఉదయం తిరుమలగిరి పీఏసీఎస్‌ కేంద్రం వద్ద రైతులు టోకెన్ల కోసం క్యూ కట్టాతరు. 11 గంటలైనా సిబ్బంది రాక పోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక మహిళా రైతులు అసహనానికి గురయ్యారు. పోలీస్‌ పహారా నడుమ టోకెన్లు అందజేశారు. ఒక్కో రైతుకు ఒక్కబస్తా మాత్రమే ఇవ్వడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా మంది రైతులకు యూరియా దొరకక ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల తోపులాట

అర్వపల్లి: యూరియా కోసం రైతుల మధ్య తోపులాట జరిగింది. అర్వపల్లి, తిమ్మాపురం పీఏసీఎస్‌లకు 500బస్తాల యూరియా రాగా వందల సంఖ్యలో రైతులు తరలివచ్చి క్యూ లైన్లలో ఉన్నారు. అయితే ఈ యూరియా చాలక రైతుల మధ్య తోపులాట జరిగింది. పోలీస్‌ బందోబస్తు మధ్య యూరియా అమ్మకాలు జరిపారు.

రోడ్డుపై బైఠాయించి ఆందోళన

పాలకవీడు: యూరియా అందించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం పాలకవీడు మండల కేంద్రంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేవారు. సకాలంలో ఎరువులు అందకపోతే మా కష్టం అంతా వృథా అవుతుందని వాపోయారు. కాసేపట్లోనే రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసుల జోక్యంతో రైతులు తమ ఆందోళనను విరమించుకున్నారు.

150 మంది రైతులకు యూరియా అందక..

పెన్‌పహాడ్‌: పెన్‌పహాడ్‌ మండల కేంద్రంలోని చీదెళ్ల పీఏసీఎస్‌ కార్యాలయం వద్దకు రైతులు సోమవారం తెల్లవారు జాము నుంచే బారులు దీరారు. 440 బస్తాల యూరియా రాగా 440మంది రైతులకు అందించారు. సుమారు 150మంది రైతులు యూరియా అందక నిరాశతో వెనుదిరిగారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

గంటల తరబడి నిరీక్షించినా

ఒక్క బస్తాతోనే సరి

చిలుకూరు: చిలుకూరు మండలంలోని నారాయణపురం పీఏసీఎస్‌కు సోమవారం యూరియా బస్తాలు వచ్చాయి. విషయం తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంటలకే పట్టాదారు పాస్‌బుక్‌, ఆధార్‌కార్డు జిరాక్స్‌లను క్యూలో పెట్టారు. గంటల తరబడి రైతులు నిలబడితే ఒక్కొక్కరికి బస్తా యూరియా మాత్రమే లభించింది.

పోలీస్‌ స్టేషన్‌లో టోకెన్ల పంపిణీ

నూతనకల్‌: యూరియా కోసం రైతులు నూతనకల్‌ మండల కేంద్రంలోని సూర్యాపేట–దంతాలపల్లి ప్రధాన రహదారిపై సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వారం రోజుల నుంచి ఉదయం 4గంటల నుంచి షాపుల ముందు పడిగాపులు కాసినా వచ్చిన యూరియాను అధికారులు సక్రమంగా పంపిణీ చేయడం లేదన్నారు. మనగ్రోమోర్‌ కేంద్రంలో వచ్చిన యూరియా రైతులకు అందించడం కోసం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ నాగరాజు సమక్షంలో ప్రతి రైతుకు ఒక బస్తా చొప్పున టోకెన్‌ అందించారు. గ్రోమోర్‌కు వచ్చిన 800బస్తాలను రైతులకు అందించడంతో రైతులు రాత్రి 8గంటల వరకు కూడా లైన్‌లో నిల్చొని యూరియా తీసుకున్నారు.

గొడవకు దిగిన రైతులు

మోతె : మోతె మండల కేంద్రంలోని మన గ్రోమోర్‌ కేంద్రం వద్ద యూరియా కోసం సోమవారం ఉదయం 6 గంటల నుంచే రైతులు బారులుదీరారు. ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున 400 బస్తాల యూరియా మధ్యాహ్నం 12 గంటల వరకు అందించారు. యూరియా దొరకని రైతులు గొడవకు దిగారు. పోలీసులు వచ్చి చెప్పినా వినకుండా మన గ్రోమోర్‌ కేంద్రంపై ఎగబడ్డారు. కేంద్రం నిర్వాహకులు చేసేదేమీ లేక మంగళవారం యూరియా ఇస్తామని షెట్టర్‌ మూసివేశారు.

ఫ యూరియా కోసం రైతులకు

తప్పని తిప్పలు

ఫ తెల్లవారు జామునుంచే పీఏసీఎస్‌ల బాట

అవే బారులు.. అదే గోస1
1/5

అవే బారులు.. అదే గోస

అవే బారులు.. అదే గోస2
2/5

అవే బారులు.. అదే గోస

అవే బారులు.. అదే గోస3
3/5

అవే బారులు.. అదే గోస

అవే బారులు.. అదే గోస4
4/5

అవే బారులు.. అదే గోస

అవే బారులు.. అదే గోస5
5/5

అవే బారులు.. అదే గోస

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement