అరచేతిలో అందం.. ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

అరచేతిలో అందం.. ఆరోగ్యం

Jun 29 2025 7:15 AM | Updated on Jun 29 2025 7:18 AM

అరచేత

అరచేతిలో అందం.. ఆరోగ్యం

సూర్యాపేట అర్బన్‌, రామగిరి(నల్లగొండ): ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు అతివలకు గోరింటాకు గుర్తుకువస్తుంది. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరాలంటూ పెద్దలు చెబుతారు. అతివలకు ఆరోగ్యంతోపాటు ఆధ్యాత్మికాన్ని పెంపొందించే గోరింటాకు సందడి జిల్లాలో మొదలైంది. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం సౌభాగ్యానికి, శ్రేయస్సుకు సంకేతంగా భావిస్తారు. గోరింటాకు మహిళల చేతులు, కాళ్లకు కొత్త అందాన్నిస్తుంది. యువతుల చేతికి గోరింటాకు ఎంత ఎర్రగా పండితే.. అంత మంచి భర్త దొరుకుతాడని విశ్వసిస్తారు. గోరింటాకు శుభానికి చిహ్నంగా భావిస్తారు.

అనేక ఔషధ గుణాలు..

వేసవిలో మన శరీరం వేడితో కూడుకుని ఉంటుంది. ఆషాఢంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది. అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి.. బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంటుంది. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆషాడంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవా లని డాక్టర్లు కూడా చెప్తున్నారు.

ఆరోగ్యానికి ఎంతో మేలు

గోరింటాకు పెట్టుకోవడంతో అంటురోగాలు దరికి చేరవు. గోరింటాకు శరీరాన్ని చల్ల పరచడానికి సహాయపడుతుంది. జ్వరం, తలనొప్పిని తగ్గిస్తుంది. జుట్టును రాలకుండా సంరక్షిస్తుంది. కేశాల పెరుగుదలకు సహాయపడుతుంది. చుండ్రును తొలగించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రుతువు మారడంతో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్యానికి మంచిది. – డాక్టర్‌ పాల ఆనంద్‌,

జనరల్‌ మెడిసిన్‌, సూర్యాపేట

రవీంద్రనగర్‌లో గోరింటాకు పెట్టుకుంటున్న మహిళలు

ప్రయోజనాలు ఇలా..

ఫ చర్మ వ్యాధుల నుంచి రక్షణ

ఫ ఒంట్లోని వేడిని తగ్గించడం

ఫ రోగనిరోధక శక్తిని పెంచడం

ఫ రక్త ప్రసరణను మెరుగుపర్చడం

ఫ గోళ్లను ఆరోగ్యంగా ఉంచడం

గోరింటాకును శుభకార్యాలు, పండుగలప్పుడు పెట్టుకోవడం ఆనవాయితీ. కొన్ని సంప్రదాయాల ప్రకారం గోరింటాకు గర్భాశయ దోషాలను తొలగిస్తుందని, సీ్త్ర ఆరోగ్యాన్ని కాపాడుతుందని నమ్ముతారు. ఆయుర్వేధంలో గోరింటాకు వేర్లు, బెరడు, ఆకులు, పూలు, విత్తనాలు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని చెబుతారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం సీ్త్రలకు సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. ఇది సీ్త్ర తత్వానికి, అందానికి ప్రతీక అని నమ్ముతారు. ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిష్యులు అంటున్నారు.

పట్టణాల్లో సామూహికంగా వేడుక

పట్టణాల్లో పలు కాలనీలలో మహిళలు ఒక చోట చేరి గోరంటాకు సేకరిస్తారు. సంప్రదాయ పద్ధతిలో రోలులో గోరంటాకును నూరుతారు. అంతా ఒకచోట సమూహంగా కూర్చొని పాటలు పాడుతూ ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటారు.

దోషాలను నివారిస్తుంది

ఆషాఢ మాసంలో అతివల గోరింటాకు సందడి

ఫ సౌభాగ్యానికి, శ్రేయస్సుకు

సంకేతంగా భావిస్తున్న మహిళలు

ఫ పట్టణాల్లోని కాలనీల్లో

సామూహికంగా వేడుకలు

ఫ గోరింటాకు పెట్టుకుని

మురిసిపోతున్న యువతులు

అరచేతిలో అందం.. ఆరోగ్యం1
1/3

అరచేతిలో అందం.. ఆరోగ్యం

అరచేతిలో అందం.. ఆరోగ్యం2
2/3

అరచేతిలో అందం.. ఆరోగ్యం

అరచేతిలో అందం.. ఆరోగ్యం3
3/3

అరచేతిలో అందం.. ఆరోగ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement