
మోగిన బడిగంట
పండుగ వాతావరణంలో పాఠశాలలు పునఃప్రారంభం
ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరాలి
నేరేడుచర్ల : కార్పొరేట్‌కు దీటుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలు చేరాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కోరారు. గురువారం నేరేడుచర్ల జెడ్పీఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలున్నాయన్నారు. నేరేడుచర్ల జెడ్పీహెచ్‌ఎస్‌లో 10వ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్‌రెడ్డి, ఎంఈఓ పుట్లూరి సత్యనారాయణరెడ్డి, హెచ్‌ఎం బట్టు మధు, ఇంపాక్ట్ ట్రైనర్ వీరవెల్లి శ్రీలత, వాసవి క్లబ్ జోన్ చైర్మన్ కొత్త లక్ష్మణ్, సభ్యులు నటరాజ్, వెంకట్, టీచర్లు వీరబాబు, వెంకటేశ్వర్‌రావు, అన్నపూర్ణ, నర్సింహారావు, నాగమణి, భానుమతి, జానయ్య, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, రాంమ్మూర్తి, బాబు, యాదగిరి పాల్గొన్నారు.
సూర్యాపేటటౌన్ : బడిగంట మోగింది. వేసవి సెలవుల అనంతరం గురువారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల్లో ఆట పాటలతో గడిపిన విద్యార్థులు బడిబాట పట్టారు. పండుగ వాతావరణంలో 2025–26 విద్యా సంవత్సరానికి అధికారులు శ్రీకారం చుట్టారు. తొలి రోజు విద్యార్థుల హాజరు అంతంత మాత్రమే ఉంది.
పండుగ వాతావరణంలో..
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను ఆయా పాఠశాల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు రంగు కాగితాలు, మామిడాకులు, కొబ్బరి మట్టలతో ముస్తాబు చేశారు. పండుగ వాతావరణంలో పాఠశాలలను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పూలు ఇవ్వడమేకాకుండా వారి పై చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. విద్యాశాఖ అధికారులు జిల్లాలోని పలు పాఠశాలలను సందర్శించారు.
20శాతమే హాజరు
జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలు కలిపి 950 వరకు ఉన్నాయి. వీటిలో 73వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా తొలి రోజు 20శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు.
యూనిఫాం, పుస్తకాలు పంపిణీ..
తొలిరోజు హాజరైన విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, జత యూనిఫాం, బ్యాగులు అందజేశారు. బడిబాటలో భాగంగా విద్యార్థుల తల్లి దండ్రులతో సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం, యూని ఫాం, బుక్స్ తదితర అంశాలను ఉపాధ్యాయులు వివరించారు.
ఫ విద్యార్థులకు పూలతో స్వాగతం పలికిన ఉపాధ్యాయులు
ఫ తొలిరోజు హాజరు అంతంతే..
ఫ పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ

మోగిన బడిగంట

మోగిన బడిగంట

మోగిన బడిగంట