తమ్ముళ్లే ఇసుక తోడేళ్లు | - | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లే ఇసుక తోడేళ్లు

Feb 7 2026 3:02 PM | Updated on Feb 7 2026 3:02 PM

తమ్ము

తమ్ముళ్లే ఇసుక తోడేళ్లు

శ్రీకాకుళం నియోజకవర్గం: వంశధార నదిలో పొన్నాం, బట్టేరు, నైరా, బైరి, కరజాడ, నాగావళి నదిలో కిల్లిపాలెం, గార మండలం బూరవల్లి, అంబల్లవలస, గార

ఆమదాలవలస నియోజకవర్గం: ఆమదాలవలస మండలంలోని నిమ్మ తొర్లువాడ, తొగరాం, కలివరం, కొత్తవలస, చవ్వాకులపేట, తోటాడ, అక్కివరం, జీకే వలస, ముద్దాడపేట, సరుబుజ్జిలి మండలంలో పురుషోత్తపురం, బూర్జ మండలంలో అల్లిన, నారాయణపురం, కాఖండ్యాంలో, పొందూరు మండలంలో సింగూరు, బొడ్డేపల్లి

నరసన్నపేట నియోజకవర్గం: మడపాం, గోపాలపెంట, జలుమూరు మండలం పర్లాం, అంధవరం, కొమ్మనాపల్లి, దొంపాక

పాతపట్నం నియోజకవర్గం: కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట మండలాల్లో వంశధార నదిలో ఎక్కడికక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

జిల్లాలోని నదుల్లో ఇసుక తోడేళ్లు పడ్డాయి. అధికారం అండతో నాయకులు ఇసుక అక్రమాలకు గేట్లెత్తేశారు. యథేచ్ఛగా టిప్పర్లతో రవాణా జరిగిపోతోంది. పచ్చనేతలు రోజుకి రూ.లక్షల్లో అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఇక్కడి ఇసుకంతా విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు తరలిపోతోంది. అదే స్థాయిలో ఒడిశాకు ఇక్కడ నుంచి ఇసుక రవాణా అవుతోంది. ఇసుక అక్రమ తవ్వకాలపై జిల్లాలో నిఘా లేదు. చెక్‌ పోస్టులను సైతం ఎత్తేశారు. పట్ట పగలే తెలుగు తమ్ముళ్లు మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి దోచేస్తున్నారు.

‘తమ్ముళ్ల’ ఆధ్వర్యంలోనే..

జిల్లాలో టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఇసుక ర్యాంపులు నడుస్తున్నాయి. ఆమదాలవలస, పాతపట్నం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, నరసన్నపేట, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అనధికార ర్యాంపులు కొనసాగుతున్నాయి. వంశధార, నాగావళి నదుల్లో ఎక్కడికక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. తాగునీటి పైపులు, తాగునీటి బావులు, వంతెనలు, పర్యావరణ సమస్యలను చూడకుండా ఇష్టారీతిన ఇసుకను తోడేస్తున్నారు. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులే సూత్రధారులు కాగా, మరికొన్ని చోట్ల వారి అనుయాయులు ఇసుక దోపిడీ సాగిస్తున్నారు. గతంలో రాత్రిపూటే తవ్వకాలు జరిపేవారు. ఇప్పుడు అఽధికారుల తనిఖీలు, నిఘా లేకపోవడంతో పగలు, రాత్రి తేడా లేకుండా నదులను గుల్ల చేసేస్తున్నారు. అక్కడక్కడా ఉన్న డీసిల్టేషన్‌ పాయింట్ల ముసుగులో మిగతా చోట్ల తవ్వేస్తున్నారు. పట్టపగలే లారీలు, టిప్పర్లతో పక్క జిల్లాకు తరలించేస్తున్నారు.

ముడుపుల మత్తులో..

ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాను అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. లారీలు, టిప్పర్లతో తరలిపోతున్నా చోద్యం చూస్తున్నారు. గతంలో నకిలీ బిల్లులతో తరలిపోతున్నా కనీసం తనిఖీలైనా చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. సరిహద్దులో చెక్‌పోస్టులు కనిపించడం లేదు. రహదారిపై అడ్డంగా ఉండే డ్రమ్ములను సైతం తీసేశారు. ఉన్నతాధికారులు సైతం పర్యవేక్షణను పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో సరిహద్దులో ఉండే కొందరు అధికారులు అక్రమ రవాణా సాగిస్తున్న వారితో లాలూచీ పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్ని లారీలు వెళ్లిపోయినా, టిప్పర్లతో ఇసుక తరలిపోతున్నా చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. ముందుగానే సంబంధిత లారీ, టిప్పర్ల యజమానులు, అక్రమ ర్యాంపులు నిర్వహిస్తున్న వారి నుంచి పెద్ద ఎత్తున ముడుపులు అందుతున్నాయి. ఇచ్చినవి తీసుకుని తమ మీదుగా వెళ్తున్న ఇసుక లారీలు, టిప్పర్లను చెక్‌ చేయకుండా వదిలేస్తున్నారు.

రూ.500 కోట్ల ఇసుక తరలింపు!

జిల్లాలో ఇప్పటికే రూ.500 కోట్ల విలువైన ఇసుక అక్రమంగా తరలిపోయిందన్న వాదనలు ఉన్నా యి. రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక తవ్వకాలతో పాటు రవాణా సాగిపోతోంది. నిత్యం ఇసు క లోడ్‌తో లారీలు, టిప్పర్ల రాకపోకలు సాగుతుండటంతో సంబంధిత పల్లెల్లోని రోడ్లు నాశనమైపోతున్నాయి. మంచినీటి బావులు, వంతెనలు కూడా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. వాటి పక్కనే తవ్వకాలు జరుగుతున్నాయి. పలుచోట్ల గ్రామస్తులు అభ్యంతరం చెప్పినా వినడం లేదు. ఇసుక అక్రమ సొమ్ము కోసం అడ్డంగా నదిలోకి రోడ్డేసి, పొక్లెయినర్లు, జేసీబీలతో ఇసుక తవ్వకాలు జరిపి, తరలించేస్తున్నారు.

దందా ఎక్కడెక్కడ..

జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ తవ్వకాలు

వంశధార, నాగావళి, బహుదా నదుల్లో తోడేస్తున్న ఇసుక

లారీలు, టిప్పర్లతో అక్రమ రవాణా

మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి దోపిడీ

పర్యవేక్షణ చేయని ఉన్నతాధికారులు

నిఘా, చెక్‌ పోస్టులను గాలికొదిలేసిన వైనం

తమ్ముళ్లే ఇసుక తోడేళ్లు 1
1/2

తమ్ముళ్లే ఇసుక తోడేళ్లు

తమ్ముళ్లే ఇసుక తోడేళ్లు 2
2/2

తమ్ముళ్లే ఇసుక తోడేళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement