భళా ప్రశాంతి
● ఏషియన్ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికై న రాగోలు వాసి
● శ్రీలంకలో నేటి నుంచి పోటీలు
● కొలంబో చేరుకున్న క్రీడాకారిణి
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన సెపక్‌తక్రా క్రీడాకారిణి గేదెల దుర్గాప్రశాంతి చరిత్ర సృష్టించింది. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలుకు చెందిన గేదెల దుర్గాప్రశాంతి భారత మహిళల సెపక్‌తక్రా జట్టుకు ఎంపికై ంది. ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు శ్రీలంకలోని కొలంబో వేదికగా జరగనున్న 6వ ఏషియన్ ఇంటర్నేషనల్ మహిళల సెపక్‌తక్రా మహిళల చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే భార త జట్టుకు ఎంపికై ంది. ఈ యువక్రీడాకారిణి భారత జట్టుతో కలిసి పోటీలు జరగనున్న కొలంబోకు చేరుకుంది.
రాగోలు నుంచి కొలంబో వరకు..
జిల్లాలోని రాగోలుకు చెందిన దుర్గాప్రశాంతి గేదెల నర్సింహులు, పుణ్యావతిల కుమార్తె. వీరిది వ్యవసాయ కుటుంబం. డిగ్రీ పూర్తిచేసిన దుర్గాప్రశాంతి పదేళ్ల క్రితమే బాస్కెట్‌బాల్ గేమ్‌లో ప్రవేశం పొందింది. ఆ వెంటనే కోచ్ గాలి అర్జున్‌రావురెడ్డి ప్రోత్సాహంతో సెపక్‌తక్రా గేమ్‌లోనూ ఓనమాలు నేర్చుకుంది. అనతికాలంలో అనేక రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తాచాటిన దుర్గా ప్రశాంతి జాతీయ స్థాయిలోనూ రాణిస్తూ ఎన్నో పతకాలు అందుకుంది. దీంతో స్పోర్ట్స్ కోటా ద్వారా నాలుగేళ్ల కిందటే పారా మిలటరీ బలగాల్లో ఒకటైన ఎస్‌ఎస్‌బీలో ఉద్యోగం సంపాదించుకుంది.
ఇండియన్ కోచింగ్ క్యాంప్‌నకు ఎంపికై ..
గేదెల దుర్గాప్రసాంతి ఈ సీజన్‌లో ఒంగోలులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించి జిల్లాను ముందంజలో నిలిపింది. గోవాలో జరిగిన ఆలిండియా సెపక్‌తక్రా మహిళల చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొ నే ఆంధ్రప్రదేశ్ మహిళల జట్టుకు ఎంపికై ంది. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ జట్టు విజేతగా నిలవడంలో కీలక భూమిక వహించింది. దీంతో సెలక్షన్ కమిటీ ప్రతినిధులు సిక్కోలు క్రీడాతేజాన్ని ఇండియన్ కోచింగ్ క్యాంపునకు ఎంపిక చేశా రు. గత ట్రాక్ రికార్డుతో పాటు మెరుగైన ప్రదర్శనలు కనబర్చడంతో జాతీయ జట్టుకు ఎంపికచేశారు. ప్రశాంతి భారత జట్టుకు ఎంపిక కావడం మాటల్లో చెప్పలేని సంతోషంగా ఉందని కోచ్ గాలి అర్జున్‌రావురెడ్డి ఆనందం వ్యక్తంచేశారు.
నా జీవిత లక్ష్యం నెరవేరింది..
జాతీయ జట్టుకు ఎంపిక కావాలన్న నా లక్ష్యం నెరవేరింది. నన్ను నిరంతరం ప్రోత్సహించిన మా పేరెంట్స్, కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా సెపక్‌తక్ర సంఘం పెద్దలు ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి, కోచ్ అర్జున్ ప్రోత్సాహం మరువలేను.
– గేదెల దుర్గాప్రశాంతి, సెపక్‌తక్రా క్రీడాకారిణి, ఇండియన్ టీమ్
జిల్లాకు గర్వకారణం
జిల్లాకు చెందిన గేదెల దుర్గా ప్రశాంతి భారత మహిళల సెపక్‌తక్రా జట్టుకు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణం. ప్రశాంతిని ఆణిముత్యంలా తీర్చిదిద్దున కోచ్ గాలి అర్జున్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. – ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి,
సెపక్‌తక్రా అసోసియేషన్
శ్రీకాకుళం జిల్లా చైర్మన్
భళా ప్రశాంతి
భళా ప్రశాంతి


