9 నుంచి ప్రీ ఫైనల్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

9 నుంచి ప్రీ ఫైనల్‌ పరీక్షలు

Feb 7 2026 3:02 PM | Updated on Feb 7 2026 3:02 PM

9 నుం

9 నుంచి ప్రీ ఫైనల్‌ పరీక్షలు

శ్రీకాకుళం: జిల్లాలో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి పదో తరగతి వారికి ప్రీ ఫైనల్‌ పరీక్షలు జరగనున్నాయి. అలాగే ఒకటి నుంచి తొమ్మి దో తరగతి విద్యార్థులకు ఎఫ్‌ఏ–4 పరీక్షలు నిర్వహిస్తారు. పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డీఈఓ రవిబాబు పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతికి సంబంధించిన ప్రశ్న పత్రాలను ఎమ్మార్సీ నుంచి క్లస్టర్‌ స్కూళ్లకు సరఫరా చేస్తారు. క్లస్టర్‌ పాఠశాలల్లో వాటిని భద్రపరుస్తారు. ఆరు నుంచి పదో తరగతి వరకు సంబంధించిన ప్రశ్న పత్రాలను ఎమ్మార్సీలోనే భద్రపరుస్తారు. ప్రశ్న పత్రాలను పరీక్ష ప్రారంభమయ్యే రోజున సరఫరా చేసేందుకు ము గ్గురు సభ్యులతో కూడిన ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తారు.

‘గిరిజన సమస్యలు ఎస్టీ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తాం’

సారవకోట: జిల్లాలోని పలు మండలాల్లో గిరిజన గ్రామాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు గిరిజన ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ చౌదరి తెలిపారు. శుక్రవారం ఆయన సారవకోటలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌కు కేబినెట్‌ హోదా కల్పించడం శుభ పరిణా మమని, ఆయన దృష్టికి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకెళ్తామని తెలిపారు. ఈ నెల 8న రంపచోడవరంలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి జిల్లా నుంచి గిరిజనులు హాజరై ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లడానికి అందరూ సిద్ధంగా ఉండాలన్నారు.

బ్రహ్మోత్సవాలకు సిద్ధం

మందస: వాసుదేవుని ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానుండడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆలయ అర్చకులు దాస్‌కూర్మాచార్యులు తెలిపారు. మొదటి రోజు ఆంజనేయ స్వామికి అభిషేకం నిర్వహిస్తారు. స్వామిని ప్రత్యేకంగా అలంకరిస్తారు.

శ్రీముఖలింగం శివరాత్రి ఉత్సవాలకు పక్కా ఏర్పాట్లు

జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగంలో ఈ నెల 15 నుంచి 18 వరకు జరగనున్న శివరాత్రి ఉత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. ఆయన శుక్రవారం ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. దర్శనం సులువుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్నారు. 18వ తేదీన వంశధార నదిలో జరగనున్న స్వామివారి చక్రతీర్థ స్నానాలు కీలకమని, భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఆయనతోపాటు శ్రీకాకుళం ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష, డీఎస్పీ లక్ష్మణమూర్తి, ఏసీ ప్రసాద్‌ పట్నాయక్‌ తోపా టు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఉత్సవాల ఏర్పాట్లపై ఆరా

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: శ్రీముఖలింగ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డిలతో ఫోన్‌ ద్వారా మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు.

9 నుంచి ప్రీ ఫైనల్‌ పరీక్షలు 1
1/2

9 నుంచి ప్రీ ఫైనల్‌ పరీక్షలు

9 నుంచి ప్రీ ఫైనల్‌ పరీక్షలు 2
2/2

9 నుంచి ప్రీ ఫైనల్‌ పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement