● పందిరి రాట
జలుమూరు: ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీముఖలింగంలో ఈ నెల 15 నుంచి 18 వరకూ వరకు జరగనున్న శ్రీముఖలింగేశ్వరుని శివరాత్రి ఉత్సవాలకు శుక్రవారం ఉదయం ఆలయ ప్రధాన ముఖద్వారం వద్ద పందిరి రాట వేశారు. పందిరి రాట వేసిన రోజు నుంచి ఆలయంలో ఉత్సవ పనులు ప్రారంభంచనున్నారు. అలాగే విద్యుత్, క్యూలు, అలంకర ణ, గర్భగుడిలో ముఖ్యమైన పనులకు సిద్ధం చేశా రు. స్వామి వాహనాలైన నంది, ఐరావతం, పార్వ తీ పరమేశ్వరుల విగ్రహాలను శుద్ధి చేయడం వంటి పనులు ప్రారంభిస్తారు. దీనికి ముందు ముత్తైదువులు పాలకొమ్మ, మామిడి తోరణాలు వెదురు కర్రతో కలిపి ముత్యాలు, గోధుమ రాయి పాలతో కలిపి భూమి పూజ చేశారు. ఆలయ ఈఓ ఏడు కొండలు, చైర్మన్ పాడి, సర్పంచ్ టి.సతీష్ కుమార్, ఎంపీటీసీ సభ్యులు కె.హరి ప్రసాద్, పురోహితులు బంకుపల్లి మధుశర్మ, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.


