
ఎయిర్‌పోర్టు వద్దు.. పచ్చని భూములే ముద్దు
మందస: తమకు ఎయిర్‌పోర్టు వద్దని, పచ్చని భూములే ముద్దు అని మందస మండలం టి.గంగువాడ గ్రామస్తులు తేల్చిచెప్పారు. గ్రామానికి చెందిన చిత్త గున్నయ్య ఆధ్వర్యంలో బాధిత రైతులు కమిటీ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు రోజులుగా గ్రామానికి కొందరు అధికారులు వచ్చి సర్వే పేరిట వచ్చి కొలతలు వేయడానికి మిషన్లు తీసుకురావడం బాధాకరమన్నారు. తమ భూములపై ఏ హక్కుతో కొలతలు వేస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే శిరీష స్పందించి తమ భూములను పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో దాసరి మోహన్‌రావు, జోగి మోహన్‌రావు, రామారావు, పుక్కల్ల నారాయణ, బాలకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు.