
ఉద్దానంలో కొబ్బరి తోటల పరిశీలన
వజ్రపుకొత్తూరు: పూండి ఉద్దానం ప్రాంతంలో కొబ్బరితోటలను శుక్రవారం జాతీయ కొబ్బరి అభివృద్ధి సంస్థ(కోయంబత్తూరు) డైరెక్టర్ ఇ.అరవేజ్, ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్.జయకుమార్, ఎస్.కుమార్‌వేలు(కొచ్చిన్) పరిశీలించారు. పల్లివూరు, రెయ్యిపాడు, అమలపాడు గ్రామాల్లో కొబ్బరి పునరుద్దధరణ పథకం, ఎల్‌ఓడీపీల అమలును పరిశీలించి రైతులకు సూచనలిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఆర్.రామ్మోహన్‌రావు, అసిస్టెంట్ డైరెక్టర్ కె.చిట్టిబాబు, మండల ఉద్యానవన శాఖ అధికారులు కె.సునీత, సీహెచ్.శంకర్‌దాసు, రైతులు పాల్గొన్నారు.
‘ఆదిత్య’కు
రూ.15 లక్షలు మంజూరు
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో వినూత్న ఆలోచనలకు వేదికగా ఉన్న ఇంక్యూబేషన్ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూ.15 లక్షలు మంజూరు చేసినట్లు కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఆటోమేటెడ్ బ్యాటరీ చార్జింగ్ సిస్టమ్ ఫర్ ఈ–వెహికల్స్ అనే ఆలోచనను తక్కువ ఖర్చుతో రూపకల్పన చేయడానికి ఈ నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు రత్నాల అలేఖ్య, సాధు ఉమా చంద్రసాయి, ఊన ప్రవళ్లిక, కొండాల దిలీప్‌కుమార్, ఎ.జ్యోత్స్న, ఎం.నిరంజన్ తదితర విద్యార్థులంతా అధ్యాపకులు జి.సతీష్‌కుమార్, పల్లి శ్రీహరి, డి.విష్ణుమూర్తి తదితరుల ఆధ్వర్యంలో ప్రాజెక్టుకు రూపకల్పన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ట్రిపుల్‌ఈ హెచ్‌ఓడీ విజయకుమార్, ఈసీఈ హెచ్‌ఓడీ అశోక్, మెకానికల్ హెచ్‌ఓడీ పి.శ్రీహరి విద్యార్థులను అభినందించారు.
అధిక దిగుబడి వల్లే ధరల తగ్గుదల
టెక్కలి: చిత్తూరు జిల్లాలో 6.5 మెట్రిక్ టన్నుల మేర తోతా మామిడి పంట పంట దిగుబడి రావడంతో ధరలు తగ్గాయని, అయినా ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం టెక్కలిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద రైతుల కోసం రూ.89 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది వరి అధికంగా దిగుబడి వచ్చిందని రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో వారి ఖాతాలకు డబ్బులు జమ చేశామని మంత్రి తెలిపారు. అనంతరం టెక్కలి చిన్నబజారులో ఆధునీకరించిన ఫిష్ మార్కెట్‌ను మంత్రి ప్రారంభించారు.
టెక్కలి ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జి సస్పెన్షన్
శ్రీకాకుళం పాతబస్టాండ్: రేషన్ డీలర్లకు సకాలంలో సరుకులు చేరవేయలేదన్న కారణంతో టెక్కలి ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జి పి. నానిబాబును జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ శుక్రవారం సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో టెక్కలి సీఎల్‌డీటీ కె.అనిల్ పాత్రోకు తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ వ్యవహారంలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం ఉందని, వారిని కాకుండా అన్యాయంగా ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జిని బలి చేశారని రెవెన్యూ, సివిల్ సప్లయ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మూడు నెలలుగా సరుకులు ఆలస్యంగా రేషన్ డిపోలకు చేరుతున్నాయని, స్టేజ్–1, స్టేజ్–2 వాహనాలు సరిగా సేవలు అందించడం లేదని నానిబాబు పలుమార్లు కార్పొరేషన్ డీఎంకు తెలియజేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని, ఆయన నిర్లక్ష్యం నానిబాబుకు శాపంగా మారిందని పలువురు సిబ్బంది అంటున్నారు.
వైన్‌షాపు వద్ద గుర్తు తెలియని మృతదేహం
శ్రీకాకుళం రూరల్: సింగుపురం పరిసర ప్రాంతంలోని ఓ వైన్‌షాపు వద్ద శుక్రవారం రాత్రి గుర్తు తెలియని మృతదేహం లభ్యమయ్యింది. ఈ వ్యక్తి రెండు రోజులుగా ఇదే ప్రాంతంలో తాగుతూ తిరిగే వాడని స్థానికులు చెబుతున్నారు. సుమారు 35 ఏళ్లు వయసు కలిగి నలుపు టీషర్ట్, జీన్‌ఫ్యాంట్ ధరించి ఉన్నాడని, వివరాలు తెలిసిన వారు శ్రీకాకుళం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు పేర్కొన్నారు.

ఉద్దానంలో కొబ్బరి తోటల పరిశీలన

ఉద్దానంలో కొబ్బరి తోటల పరిశీలన

ఉద్దానంలో కొబ్బరి తోటల పరిశీలన