
12,13 తేదీల్లో జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్–2025 పోటీలు ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెట్ట అశోక్‌కుమార్ తెలిపారు. సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు కేఎస్ మదీనా శైలానీ అధ్యక్షతన స్థానిక శాంతినగర్‌కాలనీలోని డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అశోక్‌కుమార్ మాట్లాడుతూ సుమారు రూ.2లక్షల నిధులతో టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. టైటిల్ స్పాన్షర్‌గా శ్రీకాకుళం జీఎన్‌వీ జ్యూయలర్స్ సంస్థ ఎండీ ఊన్న నాగరాజు, కో–స్పాన్షర్‌గా సోలార్ ఎనర్జీ నరసన్నపేట ప్రొప్రైటర్ రైతు షాలిని, సింహాద్రి కనస్ట్రక్షన్స్ ఎండీ జి.భీమారావు క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్‌లను, హైదరాబాద్ మ్యాచ్ పాయింట్ అకాడమీ ఎండీ ముప్పాల వేణు మెమెంటోలు అందిస్తున్నట్లు వెల్లడించారు. అండర్–11, అండర్–13, అండర్–15, అండర్–17, అండర్–19 బాలబాలికలు, సీ్త్ర, పురుషులు(సీనియర్స్) విభాగాల్లో పోటీలు జరగనున్నాయని వివరించారు. విజేతలను రాష్ట్రపోటీలకు పంపించనున్నట్టు బ్యాడ్మింటన్ జిల్లా సీఈఓ సంపతిరావు సూరిబాబు తెలిపారు. 94402 55255, 83285 14385 నంబర్లను సంప్రదించి వివరాలు నమోదుచేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జీఎన్‌వీజే శ్రీకాకుళం బీఎం పాండవ ధర్మా, బ్యాడ్మింటన్ సంఘ ప్రతినిధులు గోర అనిల్‌కుమార్, గురుబెల్లి ప్రసాద్, మెండ శాంతికుమార్, ఎంఈ రత్నాజీ, కంచరాన వైకుంటరావు, మనోహర్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.