కవిటి: ప్రఖ్యాత లండన్ బిజినెస్ స్కూల్‌లో మాస్టర్స్ ఇన్ మేనేజ్‌మెంట్(ఎంఐఎం) పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా సాధించిన జిల్లా తొలి యువతిగా కవిటి మండలం బల్లిపుట్టుగకు చెందిన పిరియా జాగృతి రికార్డు సాధించింది. శ్రీకాకుళం జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌ల కుమార్తె జాగృతి. ఈ ఏడాది దక్షిణాసియాలో భారతదేశం నుంచి లండన్ బిజినెస్ స్కూల్లో పీజీ కోర్సుకు 18 మంది అర్హత సాధించగా అందులో జాగృతి ఒకరు. బెంగళూరులో బీబీఏ పూర్తిచేశారు. యూఎస్ బేస్డ్ గోల్డ్‌మెన్ శాక్స్‌లో ఉద్యోగంలో చేరి రెండేళ్ల్లు పనిచేశారు. అనంతరం పారిస్‌కు చెందిన హెచ్‌ఈసీ సంస్థలో మూడునెలల సమ్మర్‌క్రాష్ కోర్సు పూర్తి చేశారు. అనంతరం లండన్ బిజినెస్ స్కూల్‌లో ప్రవేశానికి జరిగిన ప్రవేశపరీక్షలో జీఆర్‌ఈలో అత్యుత్తమ శ్రేణి ఫలితాన్ని సాధించారు. ఈ మేరకు నిర్వహించిన కాంగ్రగేషన్ సెర్మోనీలో జాగృతికి సర్టిఫికెట్ ప్రదానంచేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి తల్లి విజయ కూడా పాల్గొన్నారు.
లండన్ బిజినెస్ స్కూల్లో పీజీ పట్టా పొందిన పిరియా జాగృతి