
70 మద్యం బాటిళ్లు పట్టివేత
హిరమండలం: ఎల్‌ఎన్‌పేట మండలం కోవి లాం గ్రామానికి చెందిన బొమ్మాళి నవీన్ అనే యువకుడు గురువారం మద్యం బాటిళ్లతో పట్టుబడ్డాడు. ఎల్‌ఎన్‌పేట జంక్షన్ వద్ద పోలీసు లు తనిఖీ చేయగా 70 బాటిళ్లు గుర్తించి స్వాధీ నం చేసుకున్నారు. వీటిని కృష్ణాపురం తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. సరుబుజ్జిలి ఎస్సై బి.హైమావతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సింగుపురంలో..
శ్రీకాకుళం రూరల్: సింగుపురంలో ఓ వైన్‌షాపు వద్ద అదే గ్రామానికి చెందిన ఉండ లక్ష్మణరావు 26 మద్యం బాటిళ్లు కొని బెల్ట్ షాపు ద్వారా అమ్మేందుకు వెళ్తుండగా రూరల్ పోలీసులు పట్టుకున్నారు. రూ.3,673 బాటిళ్లను స్వాధీనం చేసుకుని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు శ్రీకాకుళం రూరల్ ఎస్‌ఐ రాము తెలిపారు.
జ్వరాలపై ఇంటింటా సర్వే
జి.సిగడాం: టంకాల దిగ్గువలస గ్రామంలో జ్వరాలు ప్రబలిన నేపథ్యంలో గురువారం వైద్యసిబ్బంది ఇంటింటా సర్వే చేపట్టారు. గత నెల 19 నుంచి ఈ నెల 2 వరకు మొత్తం 59 మంది వైరల్ జ్వరాలతో బాధపడ్డారని, ప్రస్తుతం ము గ్గురు మాత్రమే జ్వరాలతో ఉన్నారని వైద్యాధికారులు బుడుమూరు యశ్వంత్, పేకల సుమబిందు తెలిపారు. జల్లా అధికారుల ఆదేశాల మేరకు ఐదు బృందాలుగా సర్వే చేపట్టామన్నా రు. మరో మూడు రోజులపాటు వైద్య సిబ్బంది గ్రామంలో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
ప్రైవేటు కళాశాలలో తనిఖీలు
కవిటి: మండల కేంద్రం కవిటిలో జనసేన నాయకుడికి చెందిన కళ్యాణీ జూనియర్ కాలేజ్ లో పలాస ఆర్డీఓ జి.వెంకటేష్ గురువారం తనిఖీలు నిర్వహించారు. కళాశాల నిర్వహణపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు జరిగిన ట్లు సమాచారం. అయితే ఫిర్యాదు ఎవరు చేశా రు? తనిఖీల్లో లోపాలు ఏమైనా బయటపడ్డా యా? అనే విషయాలు తెలిపేందుకు అధికారు లు నిరాకరించారు. మీడియాకు సైతం కాలేజీ నిర్వాహకులు అనుమతించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
విద్యుత్ షాక్‌తో భవన నిర్మాణ కార్మికుడు మృతి
ఆమదాలవలస/ఎచ్చెర్ల: ఆమదాలవలస మున్సి పాలిటీ పరిధిలోని చొట్ట వానిపేట కాలనీలో గురువారం విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి మృతిచెంద గా మరొకరు గాయపడ్డారు. స్థానికులు తెలిపి న ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చొట్టవానిపేట కాలనీలో గొర్లె పెంటయ్య ఇంటి నిర్మా ణం జరుగుతోంది. లావేరు మండలం చిన్నమురపాకకు చెందిన గేదెల లక్ష్మణ్(40), మురపాక రమణ రాడ్ బెండింగ్ పనుల కోసం గురువారం వచ్చారు. ఇనుప రాడ్లను భవనంపైకి తీసుకెళ్తుండగా విద్యుత్ తీగలు తగలగడంతో షాక్‌కు గురై కిందపడ్డారు. ఈ ఘటనలో లక్ష్మ ణ్ అక్కడికక్కడే మృతిచెందగా రమణ తీవ్ర గాయాలపాలయ్యాడు. బాధితుడిని 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఆమదాలవలస పోలీసులు తెలిపారు. మృతుడు లక్ష్మణ్‌కు భార్య అసిరితల్లి, ఇద్దరు కుమారులు భాస్కరరావు, బాలరాజు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
ర్యాలీలకు అనుమతులు తప్పనిసరి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో ఎక్కడ సభలు పెట్టా లన్నా.. ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు, ఊరేగింపులు, బంద్ వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా పోలీసు శాఖ ముందస్తు అనుమతులు తప్పనిసరని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు, మత, కుల, ప్రజా, విద్యార్థి, ఉద్యోగ, ఇతరత్రా సంఘాలు కచ్చితంగా పాటించాలని, వారం రోజుల ముందే పరిధి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో (ఎస్‌ఐ/సీఐ)కి వివరాలు అందించాలన్నా రు. హింసాత్మక పోస్టర్లను ప్రదర్శించబోమని రాతపూర్వక హామీ ఇవ్వాలని స్పష్టం చేశారు.

70 మద్యం బాటిళ్లు పట్టివేత

70 మద్యం బాటిళ్లు పట్టివేత