
వంతెన గోడను ఢీకొట్టిన వ్యాన్
● రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన అరటి గెలలు
టెక్కలి రూరల్: బొప్పాయిపురం సమీపంలో జాతీ య రహదారిపై గురువారం వేకువజామున జరిగి న రోడ్డు ప్రమాదంలో ఓ వ్యాన్ వంతెన గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాల తో బయటపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. రావులపాలెం నుంచి ఒడిశా వైపు అరటి గెలల లోడుతో వెళ్తున్న వ్యాన్ టెక్కలి సమీపంలో బొప్పాయిపురం వద్దకు వచ్చేసరికి ఇరుకు వంతెన ఉండటంతో గమనించక వంతెను గోడను బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో డ్రైవర్ శాంతన్ శెట్టికి స్వల్ప గాయాలు కాగా.. వ్యాన్ రెండు భాగాలుగా విడిపోవడంతో అరటిగెలలు రోడ్డుపై పడిపోయా యి. సమాచారం అందుకున్న హైవే సిబ్బంది ఘట నా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని టెక్కలి జిల్లా ఆస్పకి తరలించారు. అనంతరం ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చేశారు. ఘటనపై టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు.