
ఉద్యోగ, రైతు వ్యతిరేక ప్రభుత్వమిది
వైఎస్ జగన్‌ను కలిసిన యువజన నేతలు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ) :వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వి. స్వరూప్, జిల్లా అధ్యక్షుడు మార్పు పృథ్వీలు మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలోయువజన విభాగ సమావేశంలో కలిశారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.
యువత, విద్యార్థులకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాలపై, అన్యాయంపై గళమెత్తాల్సిన అవసరం ఉందన్నారు. వీరితో పాటు శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గ అధ్యక్షులందరూ పాల్గొన్నారు.

ఉద్యోగ, రైతు వ్యతిరేక ప్రభుత్వమిది