
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రణస్థలం: మండలంలోని అర్జునవలస పంచాయతీ గడిజాలపేట గ్రామ సమీపంలోని రామతీర్ధాలు రహదారిపై బుధవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. జేఆర్‌పురం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని సంచాం గ్రామానికి చెందిన దాకమర్రి వంశీ(21), తన స్నేహితుడు పవన్‌తో కలిసి విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గిడిజాలపేట దగ్గర మలుపు వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. దీంతో తీవ్రగాయాలు పాలైన వంశీని తొలుత రణస్థలం సీహెచ్‌సీకి తరలించారు. అనంతరం అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. వెనుక కూర్చొని ఉన్న పవన్ చిన్న, చిన్న గాయాలతో బయటపడ్డారు. మృతుడి తండ్రి దాకమర్రి అప్పన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జేఆర్‌పురం ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు.