
ఎకై ్సజ్‌పై ఎమ్మెల్యేల పెత్తనం!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్న చందాన మారింది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎకై ్సజ్ అధికారుల పరిస్థితి. మద్యం అక్రమాలకు అడ్డు తగిలితే ‘మీకు శంకరగిరి మాన్యాలు చూపిస్తాం’ అని ఎమ్మెల్యేల బెదిరింపులు... కేసులు రాయకుండా ఏం చేస్తున్నారంటూ విజయవాడ నుంచి ఉన్నతాధికారుల ఆదేశాలు వెరసి వారి విధులు దినదినగ గండంలా తయారయ్యాయి. ఓ వైపు కేసులు రాయలేక, మరోవైపు ఎమ్మెల్యేల ఒత్తిళ్లు తట్టుకోలేక పలువురు అధికారులు సెలవులో వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఇప్పటికే కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు.
గతంలో ప్రశాంతంగా..
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పీ) కంటే ఎక్కువ అమ్ముతున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేయడం నిబంధనలకు విరుద్ధం. ఎకై ్సజ్ చట్టం ప్రకారం రూ.5 లక్షలు జరిమానా రాయాలి. కానీ రైడింగ్ చేసి కేసులు రాద్దామంటే వెంటనే ఎమ్మెల్యేలు ఫోన్ చేసి కేసులు నమోదు చేయొద్దంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఇటీవల పామిడిలో ఓ ప్రజాప్రతినిధి షాపుపై కేసు రాసినందుకు ఎకై ్సజ్ అధికారులపై మండిపడినట్టు తెలిసింది. దీంతో ఎమ్మెల్యేల ఒత్తిడితో ఎక్కడా కేసులు నమోదు చేసే పరిస్థితి లేదని వాపోతున్నారు. గతంలో ప్రశాంతంగా విధులు నిర్వహించామని.. ఇప్పుడా పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైడ్స్ చేసినందుకు ఏసీ బదిలీ..
హిందూపురంలో రెండు మాసాల క్రితం ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ మునిస్వామి కల్తీ కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేశారు. దీంతో ఆయన్ను ఏకంగా బదిలీ చేశారు. కేసు రాసిన వారంలోనే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు బదిలీ చేయించడంతో మిగిలిన అధికారులు భయపడుతున్నారు. కేసులు నమోదు చేస్తే ఎక్కడ బదిలీ చేస్తారో అంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇలాగైతే ఎంతకాలం ఉద్యోగం చేస్తామని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఎకై ్సజ్ సీఐ ఒకరు వాపోయారు. ఇప్పటికే బెల్టుషాపులు, పర్మిట్ రూములు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నా ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నామని చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. బెల్టుషాపులు, పర్మిట్ రూములు అందుబాటులోకి రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గడిచిన 10 నెలల్లో కూటమి సర్కారు తెచ్చిన కొత్త మద్యం పాలసీతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో రూ.1,400 కోట్లకు పైగా విలువైన మద్యం వినియోగమైంది. రోజూ సగటున రూ.4.69 కోట్ల విలువైన మద్యం వినియోగమవుతుండగా.. ఇటీవల వారం రోజుల పాటు జరిగిన పీర్ల పండగ సందర్భంగా రోజుకు రూ.7 కోట్ల మద్యం తాగినట్లు వెల్లడైంది.
ఎమ్మార్పీకి మించి వసూలు చేసినా కేసులు కట్టొద్దంటూ హుకుం
ఇటీవల ‘పురం’లో కల్లు దుకాణాలపై దాడులు చేశారని ఏసీ బదిలీ
అక్రమాలపై కేసులు రాయాలంటూ మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాలు
ఒత్తిళ్ల నడుమ నలిగిపోతున్న
ఎకై ్సజ్ అధికారులు
ఒత్తిడి భరించలేక సెలవులకు దరఖాస్తు చేసుకుంటున్న వైనం
రూ.1,400 కోట్ల మార్కు దాటేసింది..