
ఆన్‌లైనా? ఆఫ్‌లైనా!?
ఈ ఏడాది ఇంటర్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 12న వెలువడ్డాయి. ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీలో తమకు నచ్చిన గ్రూపులో చేరడానికి సన్నద్ధమయ్యారు. కానీ, ఫలితాలు వెలువడి మూడు నెలలు గడుస్తున్నా డిగ్రీ అడ్మిషన్లపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. ప్రవేశాలను గత ఏడాది మాదిరిగా ఆన్‌లైన్‌లో చేపడతారా?,
లేకపోతే అంతకుముందు మాదిరిగా
ఆఫ్‌లైన్‌లో చేపడతారా? అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు ఇప్పటికే అడ్మిషన్లు చేపట్టి, గోప్యంగా తరగతులు నిర్వహిస్తున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది.
హిందూపురం టౌన్: ఉన్నత విద్యపై కూటమి సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. ఇంటర్ ఫలితాలు విడుదలై మూడు నెలలు కావస్తున్నా.. నేటికీ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకపోవడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది కూడా ఉన్నత విద్యాశాఖ అడ్మిషన్ల ప్రక్రియను ఆలస్యంగా చేపట్టంతో అనేక కళాశాలల్లో పదుల సంఖ్యలో సీట్లు మిగిలిపోయాయి.
ప్రభుత్వ ఉన్నత విద్య నిర్వీర్యం..
2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు. ఫలితాలు విడుదలైనప్పటి నుంచి డిగ్రీలో ప్రవేశాలకు మూడు నెలలుగా విద్యార్థులు ఎదురు చూస్తున్నా నేటీకీ షెడ్యూల్ విడుదల కాలేదు. జూన్‌లోనే పాఠశాలలు, ఇంటర్ తరగతులు ప్రారంభమయ్యాయి. మరో వైపు డిగ్రీ కళాశాలలు కూడా నెల రోజుల క్రితమై పునఃప్రారంభమయ్యాయి. అయినా డిగ్రీలో అడ్మిషన్ల ప్రక్రియపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో ఇప్పటికే పలు ప్రైవేటు, కార్పొరేట్ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టి, గుట్టు చప్పుడు కాకుండా తరగతులనూ నిర్వహిస్తున్నారు. అడ్మిషన్ల ప్రక్రియను ఆలస్యం చేయడం ద్వారా ప్రైవేట్ కళాశాలలు పుంజుకోగా, పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ కళాశాలలు వెనుకబడి పోతున్నాయి. కూటమి ప్రభుత్వ తీరుతో ఉన్నత విద్య నిర్వీర్యమవుతోందననే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
8 వేల మంది విద్యార్థుల ఎదురుచూపులు..
2025–26 విద్యాసంవత్సరంలో డిగ్రీలో అడ్మిషన్లు పొందడానికి జిల్లా వ్యాప్తంగా దాదాపు 8వేల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2024–25 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 10వేల మందికిపైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరంతా డిగ్రీలో చేరడానికి సిద్దంగా ఉన్నారు. గత ఏడాది అడ్మిషన్ల ప్రక్రియను ఆలస్యంగా చేపట్టడంతో జిల్లా వ్యాప్తంగా చాలా కళాశాలల్లో 30 నుంచి 40 శాతం సీట్లు మిగిలిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత ఆలస్యంగా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలో ఎస్కేయూ
పరిధిలో మొత్తం డిగ్రీ కళాశాలలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు
ప్రైవేటు డిగ్రీ కళాశాలలు
30 వేల వరకు
మొత్తం విద్యార్థుల
సంఖ్య
డిగ్రీ ప్రవేశాలపై
స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
ఇంటర్ ఫలితాలు విడుదలై
మూడు నెలలు కావస్తున్నా
ఇప్పటి వరకూ విడుదల కానీ షెడ్యూల్
ప్రభుత్వ ప్రకటన కోసం విద్యార్థులు, తల్లిదండ్రుల ఎదురుచూపు
ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభించిన ప్రైవేటు కాలేజీలు
86
13
73