ఎక్కడ పడితే అక్కడే కిక్కు | - | Sakshi
Sakshi News home page

ఎక్కడ పడితే అక్కడే కిక్కు

Jun 25 2025 1:18 AM | Updated on Jun 25 2025 1:18 AM

ఎక్కడ

ఎక్కడ పడితే అక్కడే కిక్కు

అనంతపురం జిల్లాలో గత 9 మాసాల్లో మద్యం అమ్మకాలు ఇలా..
మద్యం అమ్మకం (లీటర్లలో)
99,12,006
విలువ
రూ.792,12,78,746

సాక్షి ప్రతినిధి, అనంతపురం: బెల్టుషాపుల బెండు తీసే వారు కరువయ్యారు. పర్మిట్ల రూముల వైపు అసలు చూడడమే లేదు. ‘పచ్చ’ నేతలవే మద్యం షాపులు కావడంతో నిబంధనలు గాలికి పోయాయి. ఏ సమయంలోనైనా మద్యం దొరుకుతోంది. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లా మద్యం మత్తులో జోగుతోంది. మద్యం వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు.

సామాన్యులే సమిధలు..

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో దాదాపు అన్ని చోట్లా ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే మద్యం షాపుల నిర్వహణ జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో అమ్మకాలు ఎలా పెంచాలా అన్న కోణంలో ఇష్టారాజ్యంగా నిబంధనలకు తిలోదకాలిచ్చారు.మద్యం విచ్చలవిడిగా దొరుకుతుండటంతో గడిచిన 9 మాసాల్లో రెండు జిల్లాలో 1.60 కోట్ల లీటర్ల మద్యం తాగినట్టు తాజా లెక్కల్లో తేలింది. దీన్నిబట్టి సామాన్యులు రోజువారీ మద్యం కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో అంచనా వేయొచ్చు.

ఎక్కడ చూసినా బెల్టుషాపులు

రెండు జిల్లాలో 200 వరకు మద్యం షాపులుంటే 2 వేలకు పైగా బెల్టు షాపులు ఉండటం గమనార్హం. దీంతో కూరగాయల షాపుల కంటే మద్యం షాపులే ఎక్కువగా ఉన్నట్టు తేలింది. చిన్న చిన్న గ్రామాల్లో సైతం తెలుగు తమ్ముళ్ల ఆధ్వర్యంలో రెండు, మూడు బెల్టుషాపులు నడుస్తున్నాయి. ఇక అర్బన్‌ ప్రాంతాల్లో వైన్‌షాప్‌ల పక్కనే అనధికార పర్మిట్‌ రూములు వెలిశాయి. దీంతో మద్యం లభ్యత పెరిగి విచ్చలవిడిగా వినియోగం అవుతున్నట్టు తెలు స్తోంది. రోజుకు ఉమ్మడి జిల్లాలో 60 వేల లీటర్ల మద్యం తాగుతున్నారని అంచనా. ఇక.. గడిచిన 9 మాసాల్లో 60 లక్షల బీర్లు తాగారు.

ఆఫర్లు పెట్టి మరీ..

మద్య నియంత్రణ గురించి పట్టించుకోకపోవడం, వైన్‌ షాపుల పక్కనే పర్మిట్‌ రూములు ఉండటంతో తాగినోడికి తాగినంత చందంగా మారింది. గతంలో బహిరంగ మద్యపానంపై ‘సెబ్‌’ ఉక్కుపాదం మోపేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ధాబాలు, హోటళ్లు, టీకొట్లలో కూడా తాగే వెసులుబాటు ఉండటంతో మద్యం వినియోగానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. కొన్ని చోట్ల భోజన ఆఫర్లు పెట్టిమరీ మద్యం సేల్స్‌ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. హిందూపురం, కదిరి, తాడిపత్రి ప్రాంతాల్లో వేళాపాళా లేకుండా మద్యం అమ్ముతున్నట్టు తెలుస్తోంది.

ఉమ్మడి జిల్లాలో రూ.1,300 కోట్లకు చేరువలో మద్యం అమ్మకాలు

నెలకు సగటున రూ.145 కోట్ల విలువైన మద్యం తాగుతున్నట్టు అంచనా

9 మాసాల్లో 1.60 కోట్ల లీటర్ల

మద్యం వినియోగం

మరో 60 లక్షల బీర్ల సేవనం

పర్మిట్‌రూములు, బెల్టుషాపులతో మత్తులో జోగుతున్న సామాన్యులు

ఎక్కడ పడితే అక్కడే కిక్కు1
1/2

ఎక్కడ పడితే అక్కడే కిక్కు

ఎక్కడ పడితే అక్కడే కిక్కు2
2/2

ఎక్కడ పడితే అక్కడే కిక్కు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement