వైఎస్సార్‌సీపీ నేత బాబురెడ్డి ఆకస్మిక మృతి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేత బాబురెడ్డి ఆకస్మిక మృతి

Jun 7 2025 1:10 AM | Updated on Jun 7 2025 1:10 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీ నేత బాబురెడ్డి ఆకస్మిక మృతి

చిలమత్తూరు: వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, పెనుకొండ నియోజకవర్గ మాజీ సమన్వయకర్త చల్లాపల్లి బాబురెడ్డి (46) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. మూడు రోజుల క్రితం గుండెలో నొప్పిగా ఉండడంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆయనకు స్టంట్‌ వేశారు. కోలుకుంటున్నారనుకుంటుండగానే శుక్రవారం మరోసారి గుండె పోటుకు గురై తుది శ్వాస విడిచారు. కాగా, బెంగళూరులో నివాసం ఉంటూ పెనుకొండ, హిందూపురం నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేశారు. మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. 2011–2014 మధ్య పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. ఎంతో మంది పార్టీ నేతలు, కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకున్నారు. ఆయన మృతి విషయం తెలియగానే వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్‌, హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్‌ దీపిక, నియోజకవర్గ నేత వేణురెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు, చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమరెడ్డి యలహంకలోని బాబురెడ్డి నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు.

వైఎస్సార్‌సీపీ నేత బాబురెడ్డి ఆకస్మిక మృతి 1
1/1

వైఎస్సార్‌సీపీ నేత బాబురెడ్డి ఆకస్మిక మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement