గత నెలలో వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద 33 టన్నుల బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక బృందాల తనిఖీల్లో సుమారు 600 టన్నులకు పైగా పేదల బియ్యాన్ని పట్టుకున్నారు. బృందాల తనిఖీల సమయంలో డీలర్లు భయపడినట్లు నటించారు. ప్రస్తుతం మాత్రం డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. డీలర్లు పేదల నుంచి కేజీ బియ్యం రూ.12కు బియ్యం కొనుగోలు చేస్తున్నారు. మాఫియా లీడర్ వారికి కేజీకి రూ.15లు ఇస్తున్నాడు.
చౌకదుకాణాల్లో అక్రమాలను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇవి నిత్యం క్షేత్రస్థాయికి వెళ్లి రేషన్ విక్రయాలు, నిల్వలను పరిశీలించాయి. దీంతో రెండు నెలలు చాటుమాటుగా బియ్యం అక్రమ తరలింపు సాగింది. ప్రస్తుతం బృందాలు లేకపోవడంతో మాఫియా లారీలకు బ్రేక్‌లు లేకుండా జాతీయ రహదారిపై దూసుకుపోతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు మాఫియా లారీలను అధికారులు పట్టుకున్న సందర్భాల్లేవు. దీనిని బట్టి లీడర్‌కు అధికార పార్టీ నేతల సహకారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి నెలా రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. నెల్లూరు బియ్యానికి బహిరంగ మార్కెట్‌లో మంచి పేరు ఉండటంతో ఇతర దేశాలకు కూడా అక్రమంగా ఎగుమతులు జరుగుతున్నాయి. పెద్దఎత్తున అక్రమ మార్గంలో బియ్యం తరలిపోతున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
రెండు నెలలు నటన


