కిట్లు ఎప్పుడిస్తారో..? | - | Sakshi
Sakshi News home page

కిట్లు ఎప్పుడిస్తారో..?

Jun 12 2026 6:21 AM | Updated on Jun 12 2026 6:21 AM

సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్ల సరఫరాలోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోంది. గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో పాఠశాలల పునఃప్రారంభ రోజునే జగనన్న విద్యాకానుక కిట్లను అందజేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అరకొరగా, నాసిరకంగా వీటిని ఇస్తున్నారు. కిట్లు సైతం జిల్లాకు స్వల్పంగానే వచ్చాయి. వీటిని మండల కేంద్రాలకు సరఫరా చేసామని చెప్తున్నా, అక్కడ్నుంచి పాఠశాలలకు ఎప్పుడెళ్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.

జిల్లాలో ఇలా..

జిల్లాలో 3221 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 968 ఫౌండేషన్‌.. 1187 బేసిక్‌.. 594 మోడల్‌.. 79 అప్పర్‌ ప్రైమరీ.. 288 హైస్కూళ్లు.. 74 హైస్కూళ్లు ప్లస్‌ బీపీఎస్‌.. 31 హైస్కూల్స్‌ ప్లస్‌ ఎంపీఎస్‌లు ఉన్నాయి. 1,62,127 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ తొమ్మిది రకాలతో కూడిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్లను అందజేస్తున్నారు. యూనిఫారం, బ్యాగ్‌లు, బూట్లు, సాక్సులు, నోట్‌ పుస్తకాలు, బెల్టులు, పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్స్‌, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ, పిక్టోరియల్‌ డిక్షనరీలను అందజేయాల్సి ఉంది. పాఠశాలల పునఃప్రారంభ రోజే వీటిని అందజేయాల్సి ఉన్నా, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.

అంతా నాసిరకమే..

కిట్లు నాసిరకంగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా యూనిఫారం, బ్యాగ్‌లు, బూట్లు, బెల్టులు ఇలా ఉన్నాయని తెలుస్తోంది. ఏడాది పాటు ఉండాల్సిన వస్తువులు, రెండు మూడు నెలలకే చినిగిపోవడమో లేదా కుట్లు ఊడిపోతున్నాయి. గతేడాది అందిజేసిన కిట్లను విద్యార్థులు మధ్యలోనే వదిలేసి సొంతంగా బ్యాగులు, బూట్లు కొనుగోలు చేసిన పరిస్థితి నెలకొంది. గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో అందజేసిన కిట్లు ఏడాది పొడవునా నాణ్యతగా ఉండేవి. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి మచ్చుకై నా కానరావడంలేదు. మరోవైపు విద్యార్థులందరికీ యూనిఫారాన్ని అందజేయాలంటే రెండు లేదా మూడు నెలలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదొచ్చాక వారు కుట్టించుకొని వినియోగించే సరికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

త్వరలో పూర్తి

స్థాయిలో వస్తాయి

సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్లు జిల్లాకు పూర్తి స్థాయిలో త్వరలో రానున్నాయి. కొన్ని రకాల వస్తువులు వంద శాతం వచ్చాయి. వీటిని వెంటనే ఆయా మండల కేంద్రాలకు సరఫరా చేశాం. అక్కడ్నుంచి ఆయా పాఠశాలల హెడ్‌మాస్టర్లు వీటిని తీసుకెళ్లాల్సి ఉంది. విద్యార్థులందరికీ పూర్తి స్థాయిలో అందజేయనున్నాం.

– వెంకటసుబ్బయ్య, ఏపీసీ, సమగ్రశిక్ష

వస్తువులు కావాల్సినవి వచ్చినవి శాతం ఎన్ని మండలాలకు సరఫరా యూనిఫారం 1,62,127 22,012 13.58 ఐదు బూట్లు 1,62,127 –– –– –– బ్యాగ్‌లు 1,62,127 –– –– –– నోట్‌బుక్స్‌ 8,47,716 5,65,117 66.66 27 బెల్టులు 1,15,283 92,762 80.46 30 పాఠ్యపుస్తకాలు 8,49,614 8,45,783 99.55 47 వర్క్‌బుక్స్‌ 1,93,460 1,91,447 98.96 47 ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ 14,077 14,077 100 38 పిక్టోరియల్‌ డిక్షనరీ 18,012 18,012 100 47

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement