● స్వస్థలాలకు చేరిన క్షతగాత్రులు
సంగం: కాశీ యాత్రకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు గురువారం సంగం చేరుకున్నారు. ఉత్తరభారత పుణ్యక్షేత్రాల యాత్రకు వెళ్తూ ఈ నెల 8వ తేదీన బుద్ధగయా నుంచి కాశీకి వెళ్తున్న సమయంలో అర్ధరాత్రి 12.10 గంటలకు రోడ్డు పక్కన ఆగున్న లారీని యాత్రికుల బస్సు ఢీకొని నలుగురు మృతిచెంది, పలువురు గాయపడిన విషయం విదితమే. ఇందులో గురవయ్య, నీలం శీను, నీలం పద్మ, వింజమూరు లక్ష్మమ్మ గాయపడి కట్లతో దిగడాన్ని చూసి స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు. శ్రీదేవమ్మ, రమణమ్మ, నారే పద్మ, చెంచు పోలమ్మతో పాటు మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయని వారు తెలిపారు. ప్రమాదం నుంచి గట్టెక్కి వచ్చిన వారిని చూసేందుకు వారి బంధువులు, మిత్రులు భారీగా వచ్చారు.
వస్తామనుకోలేదు
తీవ్రంగా గాయపడి వచ్చిన పద్మను చుట్టుపక్కల మహిళలు పలకరించి కన్నీటి పర్యంతమయ్యారు. పక్కింటి వారందరూ ఒక్కసారిగా వచ్చి ఆప్యాయంగా పలకరించి గుండెలకు హత్తుకొని ఆకలితో ఉన్న ఆమెకు వారే అన్నం తినిపించారు. సంగం నుంచి బయల్దేరిన రోజు అన్నం తిన్నామని, మళ్లీ ఇప్పుడు తింటున్నామని, అసలు వస్తామన్న నమ్మకం లేదని పెట్టిన కన్నీరు అక్కడి మహిళలను కలచివేసింది.
దేవుడి దయతో బయటపడ్డాం
ప్రమాదం జరిగినప్పటి నుంచి అందరం ఆందోళనకు గురయ్యాం. తిరిగి సంగం వెళ్తామన్న నమ్మ కమే లేదు. ఆహా రం సక్రమంగా లేక పస్తులుండాల్సి వచ్చింది. దేవుని దయతోనే బయటపడ్డాం.


