
యాజమాన్య నిర్లక్ష్యంతోనే మా కుమారుడి మృతి
మంగళవారం రాత్రి నా కుమారుడు రేవంత్ ఫోన్ చేసి ఎదురు రూమ్‌లో ఐదుగురు విద్యార్థులు రూమ్ మారుదామని చెబుతున్నారని, బూతులు కూడా తిడుతున్నారని, భయంగా ఉందన్నాడు. ప్రిన్సిపల్‌కు ఫోన్ చేసి చెప్పమన్నాడు. ఇన్‌చార్జికి చెప్పలేదా అని అడిగితే చెప్పాను పట్టించుకోవట్లేదని రేవంత్ చెప్పాడు. వెంటనే నేను ప్రిన్సిపల్‌కు ఫోన్ చెప్పాను. అయినప్పటికీ ప్రిన్సిపల్ పట్టించుకోలేదు. దీంతో కొద్దిసేపటికే రెండో సారి కూడా రేవంత్ ఫోన్ చేసి ప్రిన్సిపల్‌కు చెప్పావా నాన్న అని అడిగితే చెప్పాను.. ప్రిన్సిపల్ వచ్చి మాట్లాడుతానని చెప్పారని బదులిచ్చాను. ఈ క్రమంలో బుధవారం ఉదయం 8.30 గంటలకు కళాశాల నిర్వాహకులు ఫోన్ చేసి రేవంత్ ఉరేసుకున్నాడని, కొన ఊపిరితో ఉన్నాడని ఫోన్ చేశారు. అపోలో హాస్పిటల్‌కు తీసుకెళ్లామని చెప్పాం. మా కుమారుడు కళాశాల నిర్వాహకుల వల్లే మృతి చెందారని ఆరోపించారు. ఈ విషయవం మీడియాకు చెప్పొద్దని, సెటిల్‌మెంట్ చేసుకుందామని కళాశాల నిర్వాహకులు మా బంధువులతో బేరసారాలు చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. మా కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయి. తోటి పిల్లలే చేశారో.. యాజమాన్యం చేశారో పోలీసులే విచారించి న్యాయం చేయాలని కోరారు.
– రేవంత్ తండ్రి సాయిరామ్