
విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలి
నెల్లూరు (టౌన్): స్థానిక ధనలక్ష్మీపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యసాయి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక వీఆర్సీ సెంటర్‌లో ధర్నా నిర్వహించి మాట్లాడారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఫీజులు, పుస్తకాల విక్రయాలపై ఉన్న శ్రద్ధ వారి భద్రతపై లేదని మండి పడ్డారు. ఇప్పటికై నా విద్యార్థి మృతిపై విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హరీష్, బాలు, సాయి, మురళి, జనార్దన్, అబు తదితరులు పాల్గొన్నారు.