మర్రిపాడు: మండలంలోని పొంగూరుకండ్రికలో గురువారం జనారణ్యంలోకి చుక్కల దుప్పి వచ్చింది. కుక్కలు దానిని వెంటాడి గాయపరిచాయి. దీంతో దుప్పి మృతిచెందగా గమనించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
యువకుడి ఆత్మహత్య
ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని గోపాలపురం సమీపం ఉన్న ఉప్పునీటి దొరువులో దూకి మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. కృష్ణపట్నం పోర్టు ఎస్సై శ్రీనివాసరెడ్డి కథనం మేరకు.. మహారాష్ట్రకు చెందిన అనిల్ భద్ర (27), మరో ముగ్గురు వ్యక్తులు రెండురోజుల క్రితం గేట్‌వే కంపెనీలో చేరారు. వారంతా ముత్తుకూరులో ఓ హోటల్లో బసచేసి బుధవారం ఒక్కరోజే విధులు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున అనిల్‌భద్ర కనిపించకపోవడంతో మిగిలిన ముగ్గురు ఫోన్ చేశారు. అతను తన స్వస్థలానికి వెళ్లిపోతున్నానని చెప్పి కాల్ కట్ చేశాడు. ఈ నేపథ్యంలో గోపాలపురం వద్ద వాటర్ ట్యాంకర్ కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని అనిల్ ప్రయత్నించగా డ్రైవర్ చాకచక్యంగా తప్పించాడు. దీంతో పరిగెత్తుకుంటూ వెళ్లి ఉప్పునీటి దొరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు.
అనుమతి లేకుండా
దుంగలు తరలిస్తుండగా..
● రెండు ట్రాక్టర్లను
పట్టుకున్న అటవీ అధికారులు
● ఆ వాహనాలు టీడీపీ నేతవిగా గుర్తింపు
సైదాపురం: అనుమతి లేకుండా రెండు ట్రాక్టర్లలో వేప దుంగలు తరలిస్తుండగా గురువారం అటవీ శాఖాధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన మండలంలోని లింగసముద్రం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, అధికారుల కథనం మేరకు.. ప్రకృతి సంపదన నరికి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు నెల్లూరు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. వారి ఆదేశాల మేరకు స్థానిక అధికారులు తనిఖీలు చేశారు. లింగసము ద్రం గ్రామం నుంచి గూడూరుకు రెండు ట్రాక్టర్లలో వేప దుంగల్ని తరలిస్తుండగా పట్టుకున్నా రు. ట్రాక్టర్లు స్థానిక టీడీపీ నేతవిగా గుర్తించారు. ఈ సందర్భంగా నెల్లూరు అటవీ శాఖ రేంజర్ మాల్యాద్రి మాట్లాడుతూ అనుమతి లేకుండా దుంగల్ని రవాణా చేసే వారిపై కఠినమైన చర్యల తీసుకుంటామని హెచ్చరించారు. రెండు ట్రాక్టర్ల విషయమై సమగ్రవిచారణ చేస్తున్నట్లు తెలిపారు.
కుక్కల దాడిలో చుక్కలదుప్పి మృతి
కుక్కల దాడిలో చుక్కలదుప్పి మృతి