కాకాణిపై ఆగని కక్షసాధింపు | - | Sakshi
Sakshi News home page

కాకాణిపై ఆగని కక్షసాధింపు

Jul 4 2025 3:39 AM | Updated on Jul 4 2025 3:39 AM

కాకాణిపై ఆగని కక్షసాధింపు

కాకాణిపై ఆగని కక్షసాధింపు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై అక్రమ కేసుల పరంపర కొనసాగుతోంది. రిమాండ్‌లో ఉన్న ఆయన్ను మరికొన్ని రోజుల పాటు బయటకు రానీయకుండా మరిన్ని అక్రమ కేసులను నమోదు చేయాలని పోలీస్‌ అధికారులకు కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఎకై ్సజ్‌ శాఖ సైతం తలదూర్చి అక్రమ కేసులు బనాయించి ముప్పుతిప్పలు పెడుతోంది. కాకాణిపై సర్కార్‌ పాల్పడుతున్న కుట్రలతో టీడీపీ శ్రేణులు భవిష్యత్తును తలుచుకొని బెంబేలెత్తుతున్నారు.

వైఫల్యాలను ప్రశ్నించడాన్ని తట్టుకోలేక..

కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి వారి వైఫల్యాలతో పాటు స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అవినీతి, అక్రమాలను నిరంతరం ఎండగడుతూ వచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన సమయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీస్‌ శాఖ తీరును తప్పుబట్టేవారు. ఈ పరిణామాలు రుచించని ఎమ్మెల్యే, ప్రభుత్వ పెద్దలు ఆయన్ను టార్గెట్‌ చేశారు. సర్కారు ఏర్పాటైన ఐదు నెలల్లో ఏడు కేసులు నమోదు చేయించారు.

అక్రమ మైనింగ్‌ చేశారంటూ..

ఇవన్నీ బెయిలబుల్‌ కిందికొచ్చేవి కావడంతో పొదలకూరు మండలం రుస్తుం మైన్‌లో అక్రమంగా మైనింగ్‌ జరిపారంటూ మరో కేసును నమోదు చేశారు. ఇందులో ముగ్గురికి హైకోర్టు ముందస్తు బెయిలిచ్చింది. ఏ – 4గా ఉన్న కాకాణికి బెయిల్‌ను అడ్డుకోవడమే లక్ష్యంగా మరో కొత్త కుట్రను తెరపైకి తెచ్చారు. మైన్‌లో జిలెటిన్‌ స్టిక్స్‌ లాంటి పేలుడు పదార్థాలను ఉపయోగించారని.. ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టారని.. అట్రాసిటీ కేసును బనాయించి జైలుకు పంపారు. కాగా ఇదే కేసులో ఏ – 5గా ఉన్న టీడీపీ నేతను మాత్రం విచారణకు ఇప్పటికీ పిలవలేదు.

గ్రావెల్‌ తవ్వకాలకు జీఓ ఇచ్చినా..

వెంకటాచలం మండలంలోని కనుపూరు చెరువులో మట్టి తవ్వకాలకు గత టీడీపీ ప్రభుత్వం జీఓను జారీ చేసింది. దీనికి అనుబంధంగా గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రైతుల అవసరాల నిమిత్తం జీఓలను రెండుసార్లు విడుదల చేసింది. అందులో నిబంధనల మేరకే మట్టి తవ్వకాలు జరిగాయి. అయితే కేసులో ఏ – 2గా చూపి రిమాండ్‌ పొడిగించేలా చేశారు. ప్రస్తుతం ఆ కేసులో పోలీస్‌ కస్టడీకి పిటిషన్‌ వేయడంతో సోమవారానికి వాయిదా వేశారు. ఎంపీ శ్రీనివాసులురెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి సర్వేపల్లి రిజర్వాయర్‌లో గ్రావెల్‌ తవ్వకాలు చేశారని మరో అక్రమ కేసు నమోదు చేసి రిమాండ్‌ పొడిగించారు. ఇందులోనూ కాకాణిని పోలీస్‌ కస్టడీకి తీసుకొని విచారణ పూర్తి చేశారు.

లేనిపోనివి తెరపైకి..

ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టు వద్ద లారీ ఓనర్స్‌, కంటైనర్‌, కృష్ణపట్నం లాజిస్టిక్‌ అసోసియేషన్లను గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు ఏర్పాటు చేసి ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాల నుంచి వసూలు చేశారని మరో అక్రమ కేసు నమోదు చేశారు. ఇందులోనూ విచారణను పూర్తి చేశారు.

మద్యం కేసును తిరగదోడి..

గత ఎన్నికల సమయంలో ముత్తుకూరు మండలం పంటపాళెం, పొదలకూరు మండలం విరువూరులో మద్యం కేసులు పట్టుబడ్డాయి. అప్పట్లో వీటిని ఎస్‌ఈబీ అధికారులు స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈసీ నిబంధనల మేరకు వీటిపై అధికారులు చార్జీషీట్‌ను దాఖలు చేయడంతో కేసులు ముగిశాయి. తాజాగా ఈ రెండింటినీ తిరగదోడి కాకాణిపై పీటీ వారెంట్‌ను జారీ చేయడం వేధింపుల పర్వానికి నిదర్శనంగా నిలుస్తోంది.

ధైర్యంగా ఎదుర్కొంటున్న కాకాణి

ఈ కేసులు ఎకై ్సజ్‌ శాఖ పరిధిలో ఉన్నాయి. అయితే రికార్డులను పోలీస్‌ శాఖ బిగించి ఎకై ్సజ్‌ అధికారుల ద్వారా సంతకాలు చేయించి.. కాకాణి పేరును నమోదు చేసి కోర్టులో గురువారం హాజరుపర్చారు. ఈ కేసులో ఈ నెల 17 వరకు రిమాండ్‌ విధించారు. విరువూరు మద్యం కేసులో కాకాణిపై పీటీ వారెంట్‌ను సిద్ధం చేశారు. కస్టడీ పేరుతో బెయిల్‌ రాకుండా అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. ఎన్ని అక్రమ కేసులను నమోదు చేసినా, కాకాణి మాత్రం ధైర్యంగా ఎదుర్కొంటున్నారు.

17 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌

నెల్లూరు (లీగల్‌): మద్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై ఇందుకూరుపేట ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో జూలై 17 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ను విధిస్తూ న్యాయమూర్తి గురువారం ఉత్తర్వులిచ్చారు. నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి పీటీ వారెంట్‌పై నెల్లూరు స్పెషల్‌ ఎకై ్సజ్‌ (ఇన్‌చార్జి) కోర్టులో ఎకై ్సజ్‌ పోలీసులు హాజరుపర్చారు. ఎకై ్సజ్‌ తరఫున ఏపీపీ లక్ష్మీనారాయణ.. కాకాణి తరఫున రామిరెడ్డి రోజారెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, సిద్ధన సుబ్బారెడ్డి, విజయలక్ష్మి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఇన్‌చార్జి న్యాయమూర్తి నిషాద్‌ నాజ్‌షేక్‌ జూలై 17 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు ఉత్తర్వులిచ్చారు. కాకాణి తరఫున బెయిల్‌ పిటిషన్‌ను న్యాయవాదులు దాఖలు చేశారు.

తాజాగా మద్యం కేసులో పీటీ వారెంట్‌

ఈ నెల 17 వరకు రిమాండ్‌

ఆయనపై ఆరు అక్రమ కేసులు

రెండు నెలల పాటు బయటకు

రాకుండా అడ్డుకునేందుకు యత్నం

రెండు నెలల పాటు రాకూడదని..

అక్రమ మైనింగ్‌ కేసులో నెల్లూరు సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌లో ఉన్న కాకాణిని మరో రెండు నెలల పాటు బయటకు రానీయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వ పెద్దలతో పాటు పోలీసులు మరో ఆరు అక్రమ కేసులు బనాయించారు. సోమిరెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యంగ్య చిత్రాలను వాట్సాప్‌ గ్రూపుల్లో ఫార్వార్డ్‌ చేశారని.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఎమ్మెల్యే అనుచరుడు మేకల సురేంద్ర ఫిర్యాదు మేరకు మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ వ్యవహారంలో గుంటూరు కోర్టులో హాజరుపర్చగా, రిమాండ్‌ విధించారు. అయితే తప్పుడు కేసు కావడంతో హైకోర్టు స్టే ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement