
గంజాయి అక్రమ రవాణాపై దాడులు
● 4 కేజీల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం నెల్లూరు రైల్వే డీఎస్పీ జి.మురళీధర్, రైల్వే సీఐ ఎ.సుధాకర్‌తో కలిసి తన కార్యాలయంలో తనిఖీల వివరాలను వెల్లడించారు. గురువారం సాయంత్రం సీఐ పర్యవేక్షణలో రైల్వే, ఆర్పీఎఫ్ అధికారులు తమ సిబ్బందితో కలిసి నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. టాటానగర్ – ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలు దిగి నాలుగో నంబర్ ప్లాట్‌ఫారానికి వెళ్తున్న పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన బిష్షు షబ్బర్, పదహారేళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరి బ్యాగ్‌ల్లో ఉన్న రూ.80 వేల విలువైన 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒడిశా, ఏఓబీ సరిహద్దుల్లో గంజాయిని కొనుగోలు చేసి చైన్నె తదితర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని డీఎస్పీ వెల్లడించారు. కేసులో ప్రతిభ చూపిన సీఐతోపాటు ఎస్సై ఎన్.హరిచందన, సిబ్బంది రవి, వెంకటేశ్వర్లు, మణికంఠ తదితరులను డీఎస్పీ అభినందించారు.