
మా బిడ్డ మరణంపై అనుమానాలు నిగ్గు తేల్చాలి
విద్యార్థులకు మంచి
సర్వీస్ ఇస్తున్నాం
స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. పిల్లలకు డాక్టర్స్‌తో తరచూ కౌన్సెలింగ్ క్లాసెస్ ఇస్తున్నాం. తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య కూడా చిన్న చిన్న విషయాలు కూడా పరిష్కరిస్తున్నాం. ఆ రాత్రి కూడా తండ్రితో మాట్లాడాడు. ఒక్కడివే ఎందుకు స్నేహితులతో ఉండమని తండ్రి చెప్పాడు. అయినా పర్లేదు నాకు అలవాటే నాన్న అని చెప్పాడు. అయితే ఉదయానికి ఇలా ఉరేసుకున్నాడు.
– మల్లికార్జున, ప్రిన్సిపల్
నెల్లూరు సిటీ: తమ బిడ్డను ఉన్నత చదువులు చదివించేందుకు కుమారుడిని విడిచి దూరంగా ఉండలేకపోయినా తల్లిదండ్రులు హాస్టల్‌లో చదివిస్తున్నారు. అయితే హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం నేపథ్యంలో ఆ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నగరంలోని రామచంద్రాపురం మూడో వీధిలో నివాసం ఉంటున్న ఎన్.సాయిరామ్, కవిత దంపతుల కుమారుడు రేవంత్ (17)తోపాటు కుమార్తె ఉన్నారు. తండ్రి సాయిరామ్ చేజర్లలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరురూరల్ ఇన్‌స్పెక్టర్ వేణు ఘటనా స్థలానికి చేరుకుని హాస్టల్‌లో సీసీ కెమెరాలు పరిశీలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి
ఆ రోజు హాస్టల్ గదిలో ఒక్కడే నిద్ర
తెల్లారే సరికి బాత్రూమ్‌లో ఉరేసుకుని విగతజీవిగా వేలాడిన వైనం
హాస్టల్ నిర్వాహకుల తీరుపై
తల్లిదండ్రుల ఆగ్రహం
సెటిల్‌మెంట్ చేసుకుందామని
తల్లిదండ్రులతో బేరసారాలు

మా బిడ్డ మరణంపై అనుమానాలు నిగ్గు తేల్చాలి