
జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షం
కోవూరు: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసిన ఐదేళ్లు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉన్నారని, ఇప్పుడు కూటమి పాలనలో ప్రజలు దుర్భిక్షంలో కొట్టు మిట్టాడుతున్నారని మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. ఏ ఊరికి వెళ్లినా ప్రజలు మా దగ్గరకు వచ్చి మా ఓట్లు వైఎస్సార్‌సీపీకే వేశామని, అయినా కూటమి ప్రభుత్వం వచ్చి, మా జీవితాలు దుర్భరంగా మారాయని కన్నీరు పెట్టుకుంటున్నారని ప్రసన్న ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కోవూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మనస్సాక్షిగా ఇచ్చిన పథకం ఏ ఒక్కటీ లేదన్నారు. వైఎస్సార్‌సీపీ చేసిన నిరసనల ఫలితంగానే తల్లికి వందనం (అమ్మ ఒడి) డబ్బులు వేశారన్నారు. ఈ పథకం కూడా చాలా మందికి అందలేదన్నారు. చంద్రబాబు ఈవీఎంల ద్వారా సీఎం అయ్యారే కాని ప్రజలు ఇచ్చే తీర్పునకు కాదన్నారు. మా ప్రభుత్వ పాలనలో కోవూరు నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు నిధులు సమీకరించి అభివృద్ధి చేశామన్నారు. అదే ఈవీఎంల ద్వారా గెలిచిన ఎమ్మెల్యేకు అవగాహన లేకపోవడం, ఎవరో తెల్ల కాగితంపైన రాసి ఇచ్చిన దానిని చదవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో 22 మంది ఎంపీలు ఉంటే దాదాపు 17 మంది ఎంపీలతోపాటు ఇతర రాష్ట్రాల ఎంపీల వద్ద నుంచి కూడా నిధులు తీసుకువచ్చి నియోకవర్గంలో అభివృద్ది పనులు చేశామని గుర్తు చేశారు. అప్పటి మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి పనులు చేశారన్నారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసింది శూన్యమన్నారు.
ముదివర్తి– ముదివర్తిపాళెం కాజ్‌వే
ప్రసన్నన్న కృషి ఫలితమే
ముదివర్తి– ముదివర్తిపాళెం కాజ్‌వే నిర్మాణం మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రన్నకుమార్‌రెడ్డి కృషి ఫలితమేని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఘనత అని డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరిచలపతిరావు అన్నారు. ముదివర్తి– ముదివర్తిపాళెం కాజ్‌వే నిర్మాణం ఆవశ్యకతను అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న ప్రసన్నన్న ఆ నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తే మొదటి విడతగా రూ.92.32 కోట్ల నిధులతో కాజ్‌వే నిర్మాణానికి పనులు చేపట్టడం జరిగిందన్నారు.మా ప్రభుత్వంలో మేము చేపట్టిన ఈ పనిని కూటమి ఖాతాలో వేసుకోవడం సిగ్గు చేటన్నారు. కోవూరు నియోజకవర్గంలో కూటమి పాలనలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చేపట్టిన శాశ్వత ప్రయోజనకరమైన ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేశామని నిరూపిస్తే తాము రాజకీయాల నుంచే తప్పుకుంటామన్నారు.
● నెల్లూరు– మైపాడు రోడ్డుకు రూ.48 కోట్ల అంచనాతో నిధులు మంజూరు చేయించారన్నారు. బుచ్చిరెడ్డిపాళెం ప్రజల దాహార్తి తీర్చేందుకు అమృత్ పథకం కింద రూ.85 కోట్లు నిధులతో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. మరో రూ.45 కోట్లతోబుచ్చిరెడ్డిపాళెంలో సీసీ రోడ్డు, బీటీ రోడ్డుతోపాటు పార్కుల అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత మా ప్రభుత్వం, మా ప్రసన్నదేనని చెప్పారు. బుచ్చిరెడ్డిపాళెం–దగదర్తి రోడ్డు నిర్మాణ ఘటనత కూడా తమదే అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం ఏపీఎల్‌డీఏ చైర్మన్ గొల్లప్రోలు విజయ్‌కుమార్, మండల కన్వీనర్లు శ్రీనివాసులురెడ్డి, అనూప్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, నాయకులు దినేష్‌రెడ్డి, నరసింహులురెడ్డి, సుబ్బారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, షాహుల్, రఫీ, జెడ్పీటీసీ శ్రీలత, ఉమ తదితరులు ఉన్నారు.
కూటమి పాలనలో దుర్భిక్షంలో ప్రజలు
మాజీమంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డి
మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కూటమి ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు
డీసీఎంఎస్ మాజీ చైర్మన్
వీరి చలపతిరావు